భారతదేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా ఉన్న కారణంగా ఒక 54 యాప్స్ ను నిషేధిస్తూ ఇండియన్ గవర్నమెంట్ ఉత్తర్వులను జారీచేసింది. ఈ 54 యాప్స్ లో చాలా ప్రముఖ యాప్స్ కూడా ఉన్నాయి మరియు ఇవి మీ ఫోన్ లో కూడా ఉండవచ్చు. భారతీయ సెక్యూరిటీకి భంగం వాటిల్లేలా ఉన్నదువల్లే ఈ యాప్స్ నిషేదించబడ్డాయి. ఈ 54 చైనీస్ యాప్స్ లిస్ట్ లో చేర్చబడ్డాయి.
Survey
✅ Thank you for completing the survey!
భారత ప్రభుత్వం నిషేధించిన చైనీస్ యాప్స్ లో AppLock, డ్యూయల్ స్పేస్ లైట్, బ్యూటీ కెమెరా, స్వీట్ సెల్ఫీ హెచ్‌డి, బ్యూటీ కెమెరా – సెల్ఫీ వంటి కొన్ని ప్రసిద్ధ యాప్స్ కూడా ఉన్నాయి. ఇవివి మాత్రమే కాదు, Ashes of Time Lite, Viva Video Editor, Tencent Xriver, Onmyoji chess, Onmyoji Arena మరియు మరిన్ని యాప్స్ ఉన్నాయి.గత ఏడాది జూన్‌లో సుమారు 59 చైనీస్ మొబైల్ యాప్‌లను ప్రభుత్వం నిషేధించిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు కొత్తగా నిషేధించిన యాప్స్ 54 కాగా గతంలో మొదట 59 యాప్స్ ను తరువాత మొత్తం 118 యాప్స్ ను నిషేధించింది.
గతంలో అయితే, ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన చైనీస్ యాప్స్ PUBG, TikTok మరియు Helo వంటి చాలా ప్రముఖమైన యాప్స్ ను కూడా సెక్యూరిటీ కారణముగా భారత ప్రభుత్వం నిషేధించింది. అంతేకాదు, దీని తర్వాత కూడా క్రమంగా చైనీస్ యాప్‌లు ఇండియాలో నిషేధించబడ్డాయి. అప్పట్లో గాల్వన్ వ్యాలీలో జరిగిన సంఘటన తరువాత ఇటివంటి చర్యలు తీసుకోబడ్డాయి.