JioPhone 5G: చవక ధరకే 5G ఫోన్..రిలయన్స్ కొత్త టార్గెట్ ఇదేనా.!

HIGHLIGHTS

రిలయన్స్ జియో తన 5G సర్వీస్ లను ప్రారంబించేదుకు సన్నాహాలు చేస్తోంది

JioPhone 5G ను తీసుకురావడానికి కృషి

Jiophone 5G ని అనేక వేరియంట్లలో తీసుకురావచ్చు

ఇటివల జరిగిన జియో అన్యువల్ జనరల్ మీటింగ్ నుండి ప్రకటించిన విదంగా, రిలయన్స్ జియో ఈ దీపావళి నాటికి తన 5G సర్వీస్ లను ప్రారంబించేదుకు సన్నాహాలు చేస్తోంది. అంతేకాదు, 5G సర్వీసులను తీసుకొచ్చే సమయానికి తన JioPhone 5G ను కూడా తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు కొత్త నివేదికలు విన్నవిస్తున్నాయి. అయితే, గతంలో మాదిరిగా కాకుండా ఈసారి Jiophone 5G ని అనేక వేరియంట్లలో తీసుకురావచ్చని ఒక పరిశోధనా సంస్థ వెల్లడించింది.

Jiophone 5G

జియోఫోన్ 5G ని వివిధ స్క్రీన్ సైజ్, స్పెక్స్ మరియు స్టోరేజ్ అప్షన్లలో జియో తీసుకురావచ్చని భావిస్తున్నారు. అంటే, ఈ JioPhone 5G వేరియంట్స్ ధరలు బడ్జెట్ వినియోగదారులను ఆకర్షించే విధంగా ఉంటాయని ఊహిస్తున్నారు. అయితే, Jio యొక్క మునుపటి ఫోన్‌ లతో పోలిస్తే హార్డ్‌వేర్ మరియు డిజైన్ పరంగా చాలా బిన్నంగా మరియు బిగ్ అప్ గ్రేడ్ లను కలిగి ఉంటాయని ఆ పరిశోధనా సంస్థ అంచనా వేసింది.

అలాగే, Jiophone 5G యొక్క అంచనా ధరలను గురించి కౌంటర్ పాయింట్ రీసెర్చ్ కొంత సంచారాన్ని వెల్లడించింది. దీని ప్రకారం, Jiophone 5G రూ. 8,000 నుండి రూ. 12,000 మధ్య అందుబాటులోకి రావచ్చని తెలిపింది. అయితే, జియో తన 5G ఫోన్ ను 5G నెట్ వర్క్ ను మరింతగా విస్తరించిన తరువాత తీసుకురావడానికి చూస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

Jiophone 5G: లీక్డ్ స్పెక్స్

జియోఫోన్ 5జి స్పెక్స్ విషయానికి వస్తే, క్వాల్కమ్ బడ్జెట్ 5G చిప్ సెట్ స్నాప్ డ్రాగన్ 480 5G శక్తితో ఉంటుంది. ఇది మాత్రమే కాదు ఇది N3, N5, N28, N40 మరియు N78 బ్యాండ్‌లకు మద్దతు ఇస్తుంది. అంటే, ఈ ఫోన్ భారతదేశం అంతటా 5G నెట్‌వర్క్‌లకు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ 6.5 ఇంచ్ HD+ రిజల్యూషన్ LCD డిస్ప్లే, 4GB మరియు 32GB స్టోరేజ్ తో ఉంటుంది.

ఈ ఫోన్ పేద్ద 5,000 mAh బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉండవచ్చు. అంటే, గతంలో వచ్చిన Jio Phone Next తో పోలిస్తే పెద్ద మార్పులే ఈ ఫోన్ లో చూడవచ్చు. JioPhone 5G వెనుక 13-మెగాపిక్సెల్ ప్రైమరీ మరియు 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలు ఉండవచ్చు. 

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :