కోట్ల మంది రేషన్ లబ్ధిదారులకు శుభవార్త

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 14 Sep 2021
HIGHLIGHTS
  • రేషన్ కార్డ్ లబ్ధిధారుల సహాయార్ధం కొత్త APP

  • దేశంలో ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకోవచ్చు

  • రేషన్ సామునుల ధర వివరాలు తెలుసుకోవచ్చు

కోట్ల మంది రేషన్ లబ్ధిదారులకు శుభవార్త
కోట్ల మంది రేషన్ లబ్ధిదారులకు శుభవార్త

మహమ్మారి వచ్చినప్పటి నుండి ప్రజలకు సహాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత రేషన్ ఇస్తుండగా, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఉచిత రేషన్ ఇస్తోంది. అలాగే, ఎక్కడి నుండైనా రేషన్ తీసుకునే విధంగా కూడా వెసులుబాటును అందించింది మరియు రేషన్ కార్డ్ లబ్ధిధారుల సహాయార్ధం కొత్త APP ని తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా రేషన్ లభిధారులు దేశంలో ఎక్కడి నుంచైనా సరే తమ రేషన్ తీసుకోవచ్చు. అంతేకాదు, రేషన్ లభిధారుల దగ్గరలోని రేషన్ షాప్ మరియు దాని వివరాలను కూడా పొందవచ్చు. మేరా రేషన్ యాప్ పేరుతో వచ్చిన ఈ యాప్ రేషన్ కార్డు లబ్ధిదారులకు వరంలా మారుతుంది.

రేషన్ కార్డు వున్న ప్రతి ఒక్కరికి రేషన్ అందేలా చూసేందుకు ప్రభుత్వం ఈ 'మేరా రేషన్' మొబైల్ యాప్ ను లాంచ్ చేసినట్లు తెలిపింది. మేరా రేషన్ మొబైల్ యాప్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ప్లే స్టోర్ నుండి అందుబాటులో వుంది మరియు దీన్ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా మీ దగ్గర్లోని రేషన్ షాప్ వివరాలను తెలుసుసుకోవడమే కాకుండా రేషన్ సామునుల ధర వివరాలు కూడా తెలుసుకోవచ్చు.   

 మేరా రేషన్ మొబైల్ యాప్

ఈ యాప్ ను ఉపయోగించాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేయాలి. అందుకే, ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా, గూగుల్ ప్లే స్టోర్ నుండి మేరా రేషన్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. తరువాత,  మీ రేషన్ కార్డు నంబర్ తో రిజిష్టర్ చేసుకోవాలి.

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: how to use mera ration application
Tags:
mera retion app mera ration app uses రేషన్ రేషన్ కార్డ్
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status