చాలా సింపుల్ గా మీ ఓటర్ కార్డు ఫోటోతో సహా అప్డేట్ చేసుకోవచ్చు

HIGHLIGHTS

మీరు మీ ఓటరు కార్డు అప్డేట్ చాలా సులభంగా చేసుకోవచ్చు

మీ కొత్త ఫోటోను కూడా అప్డేట్ చేసుకోవచ్చు

మీ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా చాలా సులభముగా ఓటర్ కార్డు ను అప్డేట్ చేసుకోవచ్చు

చాలా సింపుల్ గా మీ ఓటర్ కార్డు ఫోటోతో సహా అప్డేట్ చేసుకోవచ్చు

మీరు మీ ఓటరు కార్డులో ఏదైనా తప్పులు లేదా కొత్త అడ్రెస్స్ వివరాలను అప్డేట్ చేసుకోవాలనుకున్నా చాలా సులభం. ప్రజలు తమ ఓటు గుర్తింపు కార్డులను అప్డేట్ చేసే విధానాన్ని తెలుసుకుంటే, మీరు కూడా మీ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా చాలా సులభముగా ఓటర్ కార్డు ను అప్డేట్ చేసుకోవచ్చు.            

Digit.in Survey
✅ Thank you for completing the survey!

వాస్తవానికి, మీకు సంబంధించిన అన్ని ద్రువీకర పత్రాలు కూడా ఒకే పేరు మరియు వివరాలతో పోలిఉండాలి. అంతేకాదు, మీ వేటర్ కార్డ్ ఇప్పటికి మీ పాత ఫోటోతోనే కొనసాగుతుంటే కూడా మీ కొత్త ఫోటోను కూడా అప్డేట్ చేసుకోవచ్చు.        

ఓటరు కార్డులో వివరాలను ఎలా సరిచేసుకోవాలి?

1. https://www.nvsp.in పేజిలోకి ప్రవేశించాలి

2. ఇక్కడ మీరు అనేకరకాల ఎంపికలను చూడవచ్చు, కానీ మీరు మాత్రం కన్ను గుర్తుతో చూపిస్తున్న "Form-8" పైన నొక్కండి

3. ఇక్కడ మీరు పైన ఎడమ భాగంలో మీకు నచ్చిన భాషను ఎంచుకోండి.

4. ఇక్కడ మీరూ మీ రాష్ట్రము, తరువాత జిల్లా మరియు అసంబ్లీ లను ఎంచుకోండి

5. దాని క్రింద మీ వివరాలైనటువంటి, మీ పేరు మరియు ఇంటిపేరు ఇంగ్లీషులో రాయండి అది పక్కనున్న గళ్ళలో తెలుగులో వస్తుంది

6. ఇక్కడ మీరు అందించే వివరాలు Voter ID ఎలాగవున్నాయో అలానే వ్రాయండి

7. మీ ఎలక్ట్రోల్ నంబరు మరియు ఎలక్ట్రోల్ సీరియల్ నంబరు ఎంటర్ చేయండి

8. మీ EPIC(ఓటరు కార్డు నంబర్) నంబరు కూడా సూచించిన దగ్గర ఎంటర్ చేయండి

9. తరువాత "ఫోటోగ్రాఫ్"  అప్షన్ ఎంచుకొండి.  

9. ఇక్కడ (e) కాలంలో మీరు సరిచేసుకోవాల్సిన వివరాలకై సంబంధించిన బాక్స్ దగ్గర టిక్ చేయాలి (ఒక్క సారి మూడు బాక్స్ మాత్రమే టిక్ చేయవచ్చు)

10. మీరు టిక్ చేసిన బాక్సుల ప్రకారంగా వివరాలను నమోదు చేయండి (ఉదా : పేరు, అడ్రస్, వయసు, పుట్టిన తేది, మొదలగునవి)

12. చివరిన సూచించిన బాక్స్ లలో మీ ఈమెయిలు ID మరియు మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి

13.  ప్లేస్ బాక్సులో మీ ప్రాంతం మరియు Captcha బాక్సులో అందించిన ఇంగ్లీష్ అక్షరాలను పక్కనున్న పెట్టెలో ఎంటర్ చేసి "Submit"    చేయండి.          

గమనిక : ఈ ఫోటో సాఫ్ట్ కాపీ మాత్రమే అయ్యుండాలి                          

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo