EPF అకౌంట్ యొక్క రిజిష్టర్ మొబైల్ నంబర్ ను ఎలా అప్డేట్ చేయాలి అని ఆలోచిస్తున్న ఎంప్లాయిస్ కు సహాయం అందించడం కోసం ఈరోజు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) అకౌంట్ లో మొబైల్ నంబర్ ను ఎలా అప్డేట్ చేయాలో ఈరోజు చూద్దాం. మీ EPF అకౌంట్ కి సంబంధించి మీకు అన్ని అవసరాలకు ముఖ్యంగా అవసరమైనది UAN నంబర్. UAN నంబర్ అంటే, యూనివర్సల్ అకౌంట్ నంబర్. ఇందులో, మీరు ఒకే UAN నంబర్ లో మీ అన్ని కంపెనీల EPF వివరాలు ఉంటాయి.
Survey
✅ Thank you for completing the survey!
అంటే, ఒకప్పుడు పనిచేసే కంపెనీ నుండి ఎంప్లాయి మరొక కంపెనీకి మారినప్పుడు వారి PF మారుతుంది మరియు పాత నంబర్ క్లోజ్ చేయ్యడం జరిగేది. అందుకే, ఒకే నంబర్ పైన జీవితాంతం అన్ని EPF లను అనుసంధానం చేసేలా ప్రభుత్వం ఈ UAN నంబర్ విధానం తీసుకొచ్చింది. అయితే, సాధారణంగా మనం కొత్త నంబర్ తీసుకున్నప్పుడు లేదా పాత నంబర్ ను మార్చవలసి వచ్చినప్పుడు EPF అకౌంట్ లో ఎలా అప్డేట్ చెయ్యాలో చాలా మందికి తెలియక పోవచ్చు. అందుకే, UAN లో మొబైల్ నంబర్ ను ఎలా అప్డేట్ లేదా చేంజ్ ఎలా చేయాలి అనే విషయాన్ని సవివరంగా చర్చిస్తున్నాను.