మీ 4G మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ మరింతగా పెంచాలా..!

HIGHLIGHTS

కొన్ని సార్లు మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ మరింత నెమ్మదిగా మారిపోతుంది

చిన్న చిన్న చిట్కాలను ఉపయోగించి మీ మొబైల్ స్పీడ్ ను పెంచవచ్చు

చాలా సింపుల్ గా చేసే బెస్ట్ ట్రిక్స్

మీ 4G మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ మరింతగా పెంచాలా..!

మొబైల్ ఇంటర్నెట్ పైన ఎక్కువగా ఆధారపడుతున్న ఈరోజుల్లో అనుకున్నంత స్పీడ్ ను మాత్రం అందుకోలేకపోతున్నారు. సిగ్నల్ సమస్యే కావచ్చు లేదా మొబైల్ సమస్యే కావచ్చు, విషయం ఏదైనా కొన్ని సార్లు మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ మరింత నెమ్మదిగా మారిపోతుంది. అటువంటి సమయంలో చిన్న చిన్న చిట్కాలను ఉపయోగించి మీ మొబైల్ స్పీడ్ ను పెంచవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటో ఈరోజు తెలుసుకుందాం.       

Digit.in Survey
✅ Thank you for completing the survey!

1. ఫోన్‌ను Re-Start చెయ్యండి

ఇది మొదటి మరియు సులభమైన మార్గం. మీ ఫోన్‌ను పునఃప్రారంభించిన (Re-Start) తరువాత, మొబైల్ నెట్‌వర్క్ సెర్చ్ చేస్తుంది. కాబట్టి, మొబైల్ ఇంటర్నెట్ వేగం చాలా రెట్లు పెరుగుతుంది. ఈ మార్గంతో పాటు మీరు మొబైల్ డేటాను ఒకసారి ఆపివేసి Re-Start చెయ్యవచ్చు.

2. ఫోన్ యొక్క ఫ్లైట్ మోడ్‌ను ఆన్ చేయండి

మొబైల్‌ను పునఃప్రారంభించడంతో పాటు, మీరు మీ ఫోన్ యొక్క ఫ్లైట్ మోడ్‌ను ఆన్ మరియు ఆఫ్ చేయవచ్చు. ఆ విధానంలో కూడా మీ ఫోన్ మళ్ళీ మొబైల్ నెట్‌వర్క్‌ను Search చేస్తుంది కాబట్టి, ఇది ఫోన్ యొక్క ఇంటర్నెట్ వేగాన్ని చాలాసార్లు పెంచుతుంది.

3. డేటా వినియోగాన్ని తనిఖీ చేయండి

చాలా ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా రోజువారీ డేటా పరిమితితో వస్తాయి. ప్లాన్ యొక్క డేటా పరిమితి గడువు ముగిసిన తరువాత, ఇంటర్నెట్ వేగం ఆటొమ్యాటిగ్గా  తగ్గుతుంది. ఈ సందర్భంలో, మీరు మీ డేటా వినియోగాన్ని ఒకసారి పరిశీలించడం మంచిది.

4. ఆటో డౌన్‌లోడ్ Update నిలిపివేయండి

సాధారణంగా యాప్స్ ను అప్డేట్ చేయ్యుడానికి  ఫోన్‌లో ఆటో డౌన్‌లోడ్ ఎంపిక ఆన్ చేయబడుతుంది. మీరు ఈ ఎంపికను ఆపివేయగలిగితే బాగుంటుంది. ఈ విధానంలో మీకు పరిమిత ఇంటర్నెట్ వినియోగం ఉంటుంది మరియు దీని తరువాత మీకు మంచి వేగం లభిస్తుంది.

5. ఫోన్ యొక్క నెట్‌వర్క్ సెట్టింగ్‌లను Reset చేయండి

మీ ఫోన్ యొక్క సెట్టింగులను మార్చినప్పటికీ చాలా సార్లు ఇంటర్నెట్ వేగం తగ్గుతుంది. అలాంటప్పుడు, మీ ఫోన్ నెట్‌వర్క్ సెట్టింగ్‌లను ఒకసారి Reset చేయడం మంచిది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo