ఇప్పుడు చాలా ఈజీగా ప్రావిడెంట్ ఫండ్ సెటిల్మెంట్

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 07 Apr 2021
HIGHLIGHTS
  • EPF ని ఈజీగా సెటిల్ చేసుకోవచ్చు

  • ఇది చాలా సులభమైన పద్ధతి.

ఇప్పుడు చాలా ఈజీగా ప్రావిడెంట్ ఫండ్ సెటిల్మెంట్
ఇప్పుడు చాలా ఈజీగా ప్రావిడెంట్ ఫండ్ సెటిల్మెంట్

గతంలో తమ ప్రోవిడెంట్ ఫండ్ అకౌంటులోని అమౌంటును తీసుకోవడానికి, తను పనిచేసిన ఆఫీసు మరియు EPFO ఆఫీసు చుట్టూ అనేక సార్లు తిరగవలసి వచ్చేది. అయితే, ఇపుడు అటువంటి ఇబ్బంది లేకుండా, కేవలం ఆన్లైన్లో ఒక అప్లికేషన్ ఇవ్వడం ద్వారా ఈ EPF ని సెటిల్ చేసుకోవచ్చు. అటువంటి సులభమైన పద్దతిని గురించి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడం మంచింది.

అయితే, ఈ EPFO లో మీ వివరాలను, ముఖ్యంగా మీ బ్యాంకు ఖాతాను ఎంటర్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు సరిగా చూసుకుని, చెక్ చేసుకుని మరి ఎంట్రీ చేయాలి. ఒకవేళ, తప్పుగా ఎంటర్ చేస్తే మీ అమౌంట్ మీరు తప్పుగా ఎంటర్ చేసిన ఆ బ్యాంకు ఖాతాకు మళ్ళించబడుతుంది. కాబట్టి, జాగ్రత్తగా ఎంటర్ చేయండి.

ఇది చాలా సులభమైన పద్ధతి.

EPF క్లెయిమ్ చేయడం ఎలా?                   

ముందుగా EPFO యొక్క అధికారక వెబ్సైట్ లోకి ప్రవేశించి, మీ యొక్క UAN (యూనివర్సల్ అకౌంట్ నంబర్) ని యాక్టీవేట్ చేసుకోవాలి( ఇప్పటి వరకు చేయనివారికోసం). వెబ్సైట్ కోసం EPFO  పైన క్లిక్ చేయండి.  

వారి సంస్థ నుండి EPF డబ్బు బదిలీ కోసం ఎదురుస్తున్నవారు మీ అభ్యర్థనను,  ఆన్లైన్లో EPFO ​​వెబ్సైట్ ద్వారా సమర్పించవచ్చు. మీ UAN మరియు రిజిస్టర్డ్ మొబైల్ నంబరుతో ఇక్కడ  మేము సూచించిన విధంగా చేయండి.

1. మొదట మీరు EPF వెబ్సైటుకు వెళ్లి  చూపిన విధంగా క్లిక్ చేయండి .

2. Employee పై క్లిక్ చేసిన తర్వాత మీరు UAN / ఆన్లైన్ సర్వీస్ (OCS / OTP) యొక్క సభ్యునికి దాని సర్వీసు పేజీకి మళ్ళించబడతారు.

3. సర్వీసుల కింద సభ్యుని UAN / ఆన్లైన్ సర్వీస్ (OCS / OTP) పై క్లిక్ చేసిన తర్వాత మీరు మీ UAN మరియు పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన పట్టికలో టైప్ చేయండి.

4. మీ UAN మరియు పాస్ వర్డు టైప్ చేసి  ఎంటర్ చేసిన తర్వాత, మీరు Manage పైన నొక్కండి. ఆ తర్వాత దానిలో కనిపించే 4 విభాగాలలో KYC పైన క్లిక్ చేయండి.

5. ఈ KYC లో మీ యొక్క ఆధార్, PAN మరియు బ్యాంకు వివరాలను నమోదుచేసి ఎంటర్ చేయండి. (ఈ వివరాలను ఇప్పటి వరకు నమోదు చేయని వారికోసం) ఇవి మీకు అప్డేట్ అవడానికి కొంత సమయం పడుతుంది.

6. ఇప్పుడు పైన కనిపించే, Online Services పైన నొక్కడం ద్వారా లోనికి ప్రవేశించి, అందులోని Claim ఎంచుకోండి. ఇక్కడ మీ వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.

logo
Raja Pullagura

email

Web Title: how to get EPF settlement easily in online
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status