Prime Day
Prime Day

మీ ఫోన్ కెమెరా పర్ఫార్మెన్స్ ఇలా పెంచుకోండి

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 11 Jun 2021
HIGHLIGHTS
  • మీ ఫోనుతో తీసే ఫొటోలు మీకు నచ్చడం లేదా?

  • మీ ఫోన్ కెమెరాని మరింత పవర్ ఫుల్ గా చేసే ట్రిక్స్

  • మీరు తెలుసుకోవాల్సిన 5 బెస్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్

మీ ఫోన్ కెమెరా పర్ఫార్మెన్స్ ఇలా పెంచుకోండి
మీ ఫోన్ కెమెరాని మరింత పవర్ ఫుల్ గా చేసే ట్రిక్స్ కావాలా?

ప్రస్తుతం కేవలం 5,000 నుండి 10,000 ధరలో కూడా మల్టి కెమేరాలతో, అదీకూడా ఎక్కువ రిజల్యూషన్ గల కెమేరాలు గల స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో లభిస్తున్నాయి. కానీ, మీ ఫోనులో ఎంత మంచి కెమేరా వున్నా కూడా కొన్ని సార్లు మీరు తీసే ఫోటోలు మీకు సంతృప్తి కరంగా అనిపించవు. అందుకు కారణం, మీరు తీసిన ఫోటో క్లియర్ గా లేకపోవడం లేదా బ్యాగ్రౌండ్ వెలితిగా ఉండడం లేదా మీరు ఊహించిన విధంగా లేకపోవడం వంటి ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ, ప్రీమియం ఫోన్ కెమెరా వంటి ఫోటోలను మీ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ తో కూడా తియ్యొచ్చు. దానికోసం మీరు తెలుసుకోవాల్సిన 5 బెస్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఇక్కడ అందిస్తున్నాను.

1. కెమేరా లెన్స్ క్లీన్ చెయ్యండి

మనం మన ఫోన్ను అనేక విధాలుగా వాడుతుంటాం మరియు మనలో చాలా మంది ఫోన్ వాడిన ప్రతీసారి క్లీన్ చెయ్యరు. అయితే, మీరు ఫోటోలను తీయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీ కెమేరా లెన్స్ ని క్లీన్ చేయ్యాలి. ఎందుకంటే, ఒక స్మార్ట్ ఫోన్ కెమేరా లెన్స్ చాలా చిన్నదిగా వుంటుంది మరియు ఒక చిన్న గీత లేదా డస్ట్ కూడా మీ ఫొటో మొత్తాన్ని అస్పష్టంగా ఉండేలా చేసే అవకాశం వుంటుంది.

2. ఫోకస్ ఆన్ కాన్సెప్ట్

మీరు ఎటువంటి ఫోటోలను తీయాలనుకుంటున్నారో, దాన్ని ముందుగానే మీరు నిర్ణయం తీసుకొని పూర్తిగా దాని పైన ద్రుష్టి పెట్టాలి. అంటే, మీ మనసులోని భావాలను చిత్రీకరించేలా ఫోటోను తీయాలని మీరు భావిస్తుంటే, దాన్ని ముందుగా ఎలా ఎక్కడ తీయాలనుకుంటున్నారో  నిర్ణయించుకోవాలి.

ఉదాహరణ : సన్ రైజ్, ప్రకృతి, పక్షులు, కోటలు ఇటువంటి మరిన్ని..

3. తగినంత వెలుగు

మీరు గనుక ఎక్కువ రిజల్యూషన్, షార్ప్ మరియు క్రిస్పీ ఫోటోలను తీయాలనుకుంటే మీకు తగినంత ఎక్కువ వెలుతురు అవసరమవుతుంది. పగటి సమయంలో మీకు తగినంత వెలుతురు ఉంటుంది కాబట్టి అటువంటి సమయంలో మంచి ఫోటోలను తీయ్యొచ్చు. అలాగే, సూర్యుడు ఎటువైపు ఉన్నాడు, నీడ ఎటువైపు పడుతుంది వంటి విషయాలను గమనించి, మీరు ఫోటో తీయదలచిన సబ్జెక్టు పైన ఏక్కువగా వెలుగు ఉండేలా చూడాలి.

4. పగలు కూడా ఫ్లాష్ ని వాడండి

 సాధారణంగా, తగినంత వెలుగు లేనప్పుడు లేదా చీకటి సమయంలో తీసే ఫోటో కోసం ఫ్లాష్ ని వాడుతుంటాం. అయితే, మనం పగలుకూడా ఫ్లాష్ వాడొచ్చు. ముఖ్యంగా, పోర్ట్రైట్ ఫోటోలను తీసేప్పుడు ఫ్లాష్ వాడడం వలన మంచి ఫలితాలను పొందవచ్చు. పోర్ట్రైట్ ఫోటోలను తీసేప్పుడు ఫ్లాష్ లైట్ వాడడం వలన ఎటువంటి షేడ్ లేకుండా ఫోటో చాల బ్రైట్ మరియు వైబ్రాంట్ గా వస్తుంది.

5. మీ ఫోన్ ఇంటెలిజన్స్ వాడుకోండి

ప్రస్తుతం, దాదాపుగా అన్ని కంపెనీల స్మార్ట్ ఫోన్లు కూడా వాటి ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ లేదా ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ (AI) ని ఉపయోగించి మంచి ఫోటోలను ఎటువంటి ఎడిటింగ్ అవసరం లేకుండానే అందిస్తాయి. ఇందులో చూస్తే గూగుల్ మరియు ఆపిల్ ప్రీమియం ఫోన్లలో వాటి సొంత సాఫ్ట్వేర్ తో చాలా గొప్ప ఫోటోలను తీసే సామర్ధ్యంతో ఉంటాయి. కానీ, బడ్జెట్ ఫోన్ల విషయానికి వస్తే, హానర్ మరియు శామ్సంగ్ వంటివి సొంత సాఫ్ట్ వేర్ తో మంచి ఫోటోలను తీసేవిధంగా ఉంటే, మిగిలిన  ఫోన్లు AI తో మంచి ఫోటాలను తీయగలవు. అయితే, మంచి బ్యాగ్రౌండ్ లేదా బ్రెట్ ఫోటోలను తియ్యడానికి గూగుల్ ఫొటోస్ సహాయం చేస్తుంది.                       

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: how to click dslr like photos with budget smartphone
Tags:
camera trick camera tips smartphone camera tricks mobile camera tricks phone camera tricks camera trick of smartphone camera best camera smartphone best smartphone camera తెలుగు న్యూస్ తెలుగు వార్తలు
DMCA.com Protection Status