మీ Whatsapp DP ఫోటో ఎవరెవరు చూశారో తెలుసుకోవాలా?

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 07 Sep 2021 | అప్‌డేట్ చేయబడింది పైన 08 Sep 2021
HIGHLIGHTS
  • Whatsapp Whatsapp DP ఫోటో చూశారో తెలుసుసుకోవాలా

  • సులభమైన మార్గం

  • పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు

మీ Whatsapp DP ఫోటో ఎవరెవరు చూశారో తెలుసుకోవాలా?
మీ Whatsapp ప్రొఫైల్ (DP) ఫోటో ఎవరెవరు చూశారో తెలుసుకోవాలా?

Whatsapp లో మన గురించి అందరికి అర్ధమయ్యేలా చెప్పాలంటే Whatsapp DP ఫోటో లేదా Whatsapp స్టేటస్ ద్వారా చూపిస్తాం. అయితే, కొన్ని సార్లు మన స్నేహితులు లేదా సన్నిహితులు లేదా మనకు తెలిసిన వారితో మనకు మనస్పర్థలు ఏర్పడతాయి. అటువంటి సమయంలో, మనం వారిని మన వాట్సాప్ అకౌంట్ నుండి బ్లాక్ చెయ్యడం లేదా తొలిగించడం వంటి పనులు చేస్తాము. అటువంటి సమయంలో మనం డిలీట్ లేదా బ్లాక్ చేసిన వారితో పాటుగా ఇంకా ఎవరెవరు మీ Whatsapp DP ఫోటో చూశారో తెలుసుకోవాలని మీకు కుతూహలంగా ఉండవచ్చు. అందుకే, మీ వాట్సాప్ స్టేటస్ లేదా DP ఎవరెవరు చూశారో ఎలా చెక్ చేయాలో ఇక్కడ తెలుసుకోండి. 

మీ Whatsapp స్టేటస్ ఎవరెవరు చూశారో ఈజీగా తెలుసుకోవచ్చు. కానీ, ఈరోజు మీ Whatsapp DP ఫోటో చూశారో ఎలా తెలుసుకోవాలి?  అని తెలుసుకుందాం.

మీ Whatsapp DP ఫోటో చూశారో తెలుసుకోవడానికి ఒక Android app డౌన్ లోడ్ చేసుకోవలసి వుంటుంది. Who Viewed My Whatsapp Profile లేదా Whats Track యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ Google play Store నుండి ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

మీ ఫోన్ లో ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసిన తరువాత రన్ చెయ్యడానికి కొంత సమయం పడుతుంది. ఈ టైమ్ లో మీ వాట్సాప్ కాంటాక్ట్స్ నుండి మీ ప్రొఫైల్ లేదా డిస్ప్లే పిక్చర్(DP) ని ఎవరెవరు చూశారనే వివరాలను సేకరిస్తుంది. తరువాత, ఈ యాప్ లో మీ వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోను చూసిన స్నేహితుల లేదా ఇతరుల మొబైల్ నెంబర్లు మరియు పేర్లను పొందుతారు.

అయితే, ఈ యాప్ కేవలం 24 గంటల వ్యవధిలో మీ వాట్సాప్ ప్రొఫైల్ చూసిన వారి వివరాలను మాత్రమే ఈ జాబితాలో అందిస్తుంది. ఇందులో, మొదటిగా విజిటర్ ఎవరు అని తెలుసుకోవచ్చు. తరువాత, ఆ విజిటర్ ఎప్పుడు ఈ ప్రొఫెల్ చూశారో చూడవచ్చు. చివరిగా, విజిటర్ యొక్క కాంటాక్ట్ వివరాలను కూడా చూడవచ్చు.

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: how to check whatsapp status here is best way t check
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status