how to check live Weather update in online or mobile
Weather: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉన్నట్లు రిపోర్ట్ తెలిపింది. అయితే, మరికొన్ని ప్రాంతాల్లో హీట్ వేవ్స్ తాకిడి తప్పదని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6 జిల్లాల్లో ఈరోజు ఈదురు గాలులతో కూడిన వర్ష సూచన అందించింది. అయితే, కొన్ని ప్రాంతాల్లో మాత్రం వేడి గాలులు మరియు భానుడి ప్రతాపానికి గురి కావాల్సి ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
నిన్నటి వరకు భానుడి ప్రతాపాన్ని చవిచూసిన తెలుగు రాష్ట్రాలు, ఈరోజు మరియు రేపు తక్కువ ఉష్ణోగ్రతను నమోదు చేస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అంతేకాదు ఈరోజు మరియు రేపు అనేక ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వాతావరణం చల్లబడుతుంది. రాత్రి హైదరాబాదులో భారీ వర్షం నమోదు అవ్వగా, ఈరోజు కూడా అదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ సూచించింది.
ఈ రోజుల్లో వాతావరణ లైవ్ అప్డేట్ మరియు సమాచారం తెలుసుకోవడం చాలా సులభంగా మారింది. గతంలో టీవీ లేదా పేపర్లలో మాత్రమే వాతావరణ సూచనలు తెలిసేవి. కానీ, ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లేదా ఇంటర్నెట్ ద్వారా ఎప్పుడైనా ఎక్కడైనా వాతావరణ సమాచారం చెక్ చేయవచ్చు. ముఖ్యంగా, వర్షాలు, తుఫాను, ఎండ తీవ్రత వంటి విషయాలు చాలా ముందుగా తెలుసుకోవచ్చు. దీనివల్ల ప్రయాణాలు, వ్యవసాయ పనులు మరియు ప్రజల రోజువారీ ప్లానింగ్ కూడా సులభంగా మరియు సురక్షితంగా మారింది.
స్మార్ట్ ఫోన్ లో వాతావరణ సమాచారం తెలుసుకోవడానికి ముందుగా మొబైల్ లో ఉన్న Weather App ఉపయోగించవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్లలో Google Weather, Samsung Weather వంటి యాప్స్ ముందే ఉంటాయి. ఐఫోన్ లో Apple Weather app అందుబాటులో ఉంటుంది. యాప్ ఓపెన్ చేసిన తర్వాత లొకేషన్ పర్మిషన్ ఇవ్వాలి. అప్పుడు మీ ప్రాంతంలోని ప్రస్తుత ఉష్ణోగ్రత, వర్ష సూచనలు, గాలి వేగం మరియు హ్యుమిడిటీ వంటి వివరాలు కనిపిస్తాయి.
అలాగే ఆన్లైన్ లో కూడా వాతావరణ సమాచారం చెక్ చేయవచ్చు. గూగుల్ లో “Weather Today” లేదా మీ నగరం పేరు టైప్ చేస్తే వెంటనే వాతావరణ సమాచారం కనిపిస్తుంది. ఉదాహరణకు “Hyderabad Weather” అని సెర్చ్ చేస్తే ఈరోజు నుంచి రాబోయే కొన్ని రోజుల వాతావరణ వివరాలు చూపిస్తుంది. ఇది కాకుండా AccuWeather, The Weather Channel, Windy, IMD వంటి వెబ్ సైట్ లు మరింత కచ్చితమైన సమాచారం అందిస్తాయి.
Also Read: Price Cut: ఫ్లిప్ కార్ట్ తగ్గింపు తో లేటెస్ట్ 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ బడ్జెట్ ధరలో లభిస్తోంది.!
ప్రస్తుతం చాలా వాతారణ యాప్స్ AI మరియు శాటిలైట్ డేటా ఉపయోగించి మరింత ఖచ్చితమైన అంచనాలు అందిస్తున్నాయి. అయితే, వాతావరణ సమాచారం ఎప్పుడూ 100% కచ్చితంగా ఉండకపోవచ్చు. అందుకే ముఖ్యమైన ప్రయాణాలు లేదా కార్యక్రమాలకు ముందు అధికారిక వాతావరణ శాఖ అప్డేట్స్ కూడా చెక్ చేయడం మంచిది. టెక్నాలజీ అభివృద్ధి తో ఇప్పుడు వాతావరణ సమాచారం మన చేతిలోనే అందుబాటులోకి వచ్చింది.