Whatsapp లో మీ EPFO అకౌంట్ డీటెయిల్స్ చేయడానికి కంప్లీట్ స్టెప్ బై స్టెప్ గైడ్ ఇదిగో.!

Highlights

కేవలం ఒక సింగిల్ మెసేజ్ తో ఎంప్లాయిస్ వారి పీఎఫ్ ఖాతా వివరాలు పొందవచ్చు

వాట్సాప్ లో కొత్తగా తెచ్చిన ఈ సర్వీస్ ని ఎలా ఉపయోగించాలి అని చాలా మంది సెర్చ్ చేస్తున్నట్లు తెలుస్తోంది

Whatsapp లో మీ EPFO అకౌంట్ డీటెయిల్స్ చెక్ చేయడానికి కంప్లీట్ స్టెప్ బై స్టెప్ గైడ్

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (PF) వివరాలు మరింత సులభంగా మరియు శీఘ్రంగా తెలుసుకోవడానికి వీలుగా ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కొత్తగా వాట్సాప్ సర్వీసులను ప్రవేశపెట్టింది. ఈ కొత్త వాట్సాప్ సర్వీస్ తో ఈపీఎఫ్ఓ వెబ్‌ సైట్ లేదా ఆఫీస్ తో పని లేకుండా కేవలం ఒక సింగిల్ మెసేజ్ తో ఎంప్లాయిస్ వారి పీఎఫ్ ఖాతా వివరాలు పొందవచ్చు. అయితే, వాట్సాప్ లో కొత్తగా తెచ్చిన ఈ సర్వీస్ ని ఎలా ఉపయోగించాలి అని చాలా మంది సెర్చ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే, వారికి సహాయంగా Whatsapp లో మీ EPFO అకౌంట్ డీటెయిల్స్ చెక్ చేయడానికి కంప్లీట్ స్టెప్ బై స్టెప్ గైడ్ ఈరోజు అందించాము.

Whatsapp లో మీ EPFO అకౌంట్ డీటెయిల్స్

ఒకప్పుడు ఒక ఒక ఉద్యోగి తన ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ బ్యాలెన్స్, పాస్ బుక్ లేదా ఏదైనా ఇతర వివరాలు తెలుసుకోవాలంటే ఈపీఎఫ్ ఆఫీసును మాత్రమే సంప్రదించాల్సి వచ్చేది. అయితే, మారిన కాలంతో పాటు ఆన్లైన్ సర్వీస్ లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, ఇప్పుడు ఈ సర్వీస్ కంటే కూడా వేగంగా ఉద్యోగి తన ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ వివరాలు తెలుసుకునేలా ఈ కొత్త వాట్సాప్ సర్వీస్ ను పరిచయం చేసింది.

ఈ వాట్సాప్ సర్వీస్ ను ఈపీఎఫ్ఓ 74 వ వ్యవస్థాపక దినోత్సవం రోజున అనౌన్స్ చేసింది మరియు వెంటనే అమలులోకి కూడా తీసుకొచ్చింది. ఈ సర్వీస్ ఇప్పుడు ఎంప్లాయిస్ అందరికీ అందుబాటులో ఉంది. ఈ కొత్త సర్వీస్ ద్వారా ఈపీఎఫ్ఓ సభ్యులు వాట్సాప్ ద్వారా వారి PF అకౌంట్ బ్యాలెన్స్, పాస్‌ బుక్ వివరాలు మరియు అకౌంట్ లావాదేవీలు కూడా తక్షణమే తెలుసుకోవచ్చు.

Whatsapp లో మీ EPFO వివరాలు కోసం ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి

  • ముందుగా ఈ వాట్సాప్ నుంచి +918796441800 నంబర్‌ ఎంటర్ చేయండి
  • ఈ నెంబర్ చాట్ బాక్స్ ఓపెన్ చేసి ‘Hi’ అని మెసేజ్ సెండ్ చేయండి
    ఇక్కడ మీకు భాష ఎంచుకోండి అని అడుగుతుంది, ఎంచుకోండి
  • ఇక్కడ మీకు కొత్త అకౌంట్ వివరాలు కోసం కొత్త చాట్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది
  • ఇందులో చెక్ బ్యాలెన్స్, డౌన్ లోడ్ పాస్ బుక్ మరియు చివరి 5 లావాదేవీలు అపశ్యన్స్ ఉంటాయి
  • ఇక్కడ మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకోండి
  • మీకు ఇక్కడ UAN నెంబర్ మరియు అందులో ఉన్న PF అకౌంట్స్ చూపిస్తుంది
  • ఇందులో మీరు తెలుసుకోవాల్సిన అకౌంట్ ని సెలెక్ట్ చేసుకోండి

ఇలా పైన తెలిపిన టెస్ప్ ఉపయోగించి మీరు మీ బ్యాలెన్స్ లేదా అకౌంట్ పాస్ బుక్ డౌన్ లోడ్ మరియు చివరిగా అకౌంట్ నుంచి చేసిన 5 లావాదేవీలను తెలుసుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

View full profile