ఓటర్ కార్డు అడ్రస్ చేంజ్…స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు..!

HIGHLIGHTS

మీ అడ్రస్ మార్చుకునే విధానాన్ని చాల సులభతరం చేసింది.

మీ ప్రస్తుత అడ్రస్ ని చాలా సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు

మీ ఓటరు కార్డులోని తప్పులను కూడా చాలా సులభంగా మీరే సరిచేసుకోవచ్చు.

ఓటర్ కార్డు అడ్రస్ చేంజ్…స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు..!

ఓటర్ కార్డు అడ్రస్ చేంజ్…స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. ఎందుకంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ECI) మీ అడ్రస్ మార్చుకునే  విధానాన్ని చాల సులభతరం చేసింది. దీని కోసం మీరు ఎక్కడికి వెళ్ళవలసిన పనిలేదు. కేవలం మీ స్మార్ట్ ఫోన్ తో ఎక్కనుండైనా మీ ప్రస్తుత అడ్రస్ ని చాలా సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు. అంతేకాదు, మీ ఓటరు కార్డులోని తప్పులను కూడా చాలా సులభంగా మీరే సరిచేసుకోవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అలాగే, మీ పాత నియోజకవర్గం నుండి మీరు అడ్రస్ మారినట్లయితే, మీ యొక్క కొత్త నియోజకవర్గం వివరాలను కూడా మార్చుకోవచ్చు మరియు మీ యొక్క అన్ని వివరాలు కూడా అలాగేవుంటాయి. EIS (భారత ఎన్నికల సంఘం) ఓటరు యొక్క ఐడిలోని  చిరునామాను మార్చుకోవడానికి ఆన్లైన్ దరఖాస్తు విధానాన్ని ప్రవేశపెట్టింది.

ముందుగా జాతీయ ఓటరు సర్వీసు పోర్టల్ కోసం https://www.nvsp.in/  వెబ్ సైట్ లోకి ఎంటర్ అవ్వండి. కొత్త ఓటరు రిజిస్ట్రేషన్ కోసం "కరెక్షన్" ఎంచుకోవడం ద్వారా ఆన్లైన్ ఫారం వస్తుంది దానిని భర్తీ చేయడం కోసం "ఆన్లైన్లో వర్తించు" ఎంచుకోండి

  • ఇక్కడ అందుబాటులోవున్న,  ఫారం 6A/8A ఎంచుకొండి, మీకు ఆన్లైన్ ఫారం కొత్త ట్యాబులో కనిపిస్తుంది       
  • మీ పేరు చిరునామా,రాష్ట్రం మరియు మీ యొక్క కొత్త చిరునామాతో సహా పూర్తి వివరాలను ఎంటర్ చేయండి
  • మీ ప్రస్తుత చిరునామాని తెలియచేసే ఒక పత్రాన్ని (ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, లేదా మరేదైనా అధికార ద్రువీకర పత్రం వంటివి) అప్లోడ్ చేయండి
  • మీ  ఫారంను పూర్తిగా నింపి పత్రాన్ని అప్లోడ్ చేసి, ఆన్లైన్ లో ఫారంను సమర్పించండి ( సబ్మిట్ చేయండి)
  • మీరు ఆన్లైన్ లో మీ అప్లికేషన్ ట్రాక్ చేసే ఒక రిఫరెన్స్ నంబరును అందుకుంటారు
  • మీ ఫారం అందిన తరువాత, ఎలక్షన్ అధికారుల మీ కొత్త అడ్రస్ నందు  తనిఖీచేస్తారు
  • ఈ తనిఖీ తరువాత, మీరు విజయవంతంగా మీ యొక్క ప్రస్తుత చిరునామా
  • కలిగిన కొత్త ఓటరు ఐడి కార్డును అందుకుంటారు.              

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo