ఆన్లైన్లో ఎయిర్ కండిషనర్ (AC) కొనే ముందుగా ఈ విషయాలు ఖచ్చితంగా గుర్తుంచుకోండి

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 18 Mar 2021
HIGHLIGHTS
  • మంచి ఎయిర్ కండిషనర్ కొనాలని చూస్తున్నారా?

  • ఆన్లైన్లో చెక్ చేసి బుక్ చేద్దామనుకుంటున్నారా?

  • మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవడం మంచింది

ఆన్లైన్లో ఎయిర్ కండిషనర్ (AC) కొనే ముందుగా ఈ విషయాలు ఖచ్చితంగా గుర్తుంచుకోండి
ఆన్లైన్లో ఎయిర్ కండిషనర్ (AC) కొనే ముందుగా ఈ విషయాలు ఖచ్చితంగా గుర్తుంచుకోండి

మండే వేసవిలో  కూడా మీ కుటుంబానికి చల్లని వాతావరణాన్ని అందించే  మంచి ఎయిర్ కండిషనర్ కొనాలని చూస్తున్నారా? ఎటువంటి శ్రమ లేకుండా ఆన్లైన్లో చెక్ చేసి బుక్ చేద్దామనుకుంటున్నారా? అయితే, మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవడం మంచింది.

ఎందుకంటే, AC పరిమాణం మరియు కెపాసిటీ లేదా ఏదో కొత్త టెక్నాలజీ అంటూ చాలా కంపెనీలు తమ యాడ్స్ తో ఉదరగొడుతుంటాయి. కానీ, వాస్తవానికి AC ని ఎంచుకోవడానికి కొంత శీలన అవసరం. అందుకోసమే, ఒక మంచి AC ని మీరు కొనేలా చేయడానికి, మీకు సహాయం చేయనున్నాము. ఇక్కడ మేము సూచించిన ఈ విషయాలను గుర్తు పెట్టుకుంటే, ఖచ్చితంగా ఒక మంచి AC ని మీరు ఎంచుకోవచ్చు.

1. గది పరిమాణం

AC కొనుగోలు చేసే ముందుగా మనం గుర్తుంచుకోవాల్సింది, ఆ AC ని ఏ గదిలో అమర్చాలనుకుంటున్నాము. ఎందుకంటే, మనము ఎంచుకునే గది యొక్క పరిమాణాన్ని బట్టి మనం తెసుకోవాల్సిన AC యొక్క కెపాసిటీ ని అంచనా వేయాల్సి ఉంటుంది.

ఉదా : బెడ్ రూమ్, ఒక సాధారణ బెడ్ రూమ్ కోసం 1 టన్ నుండి 1.2 టన్ కెపాసిటీ AC అవసరమవుతుంది. అదే ఒక మీడియం హాల్ కోసం కనీసం 1.5 టన్ AC అవసరమవుతుంది.

2.  విద్యుత్ వినియోగం

AC కొనేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకొవాల్సిన విషయం, విద్యుత్ వినియోగం అని కచ్చితంగా చెప్పోచ్చు. ఎందుకంటే, AC అత్యధికమైన విద్యుత్ వినియోగాన్ని తీసుకుంటుంది. కాబట్టి, మనకు ఎక్కువ బిల్ వస్తుంది. అందుకోసమే, తక్కువ విద్యుత్ వినియోగాన్ని వాడుకుని ఎక్కువగా పనిచేసేలా వుండే AC లను ఎంచుకోవడం మంచిది. ఎక్కువగా స్టార్స్ ఉన్న AC లు ఎక్కువగా ప్రయోజనాలను ఇస్తాయి.

3. కాపర్ కండెన్సర్ కాయిల్

AC కండెన్సర్లు గాలిని చల్లబరచి మనకు అందించానికి కాయిల్స్ ను ఉపయోగించుకుంటాయి. అయితే, మనకు తెలుసు కాపర్ అత్యంత వేగవంతమైన ఉష్ట్న వాహకమని, కాబట్టి కాపర్ కాయిల్స్ ఉన్న AC లను ఎంచుకోవడం ద్వారా అత్యంత త్వరగా చల్లబరిచే స్వభావాన్ని మీరు మీ AC నుండి పొందుతారు.

4. ఇన్వర్టర్ సాంకేతికత

మీకు పూర్తి సేవింగ్స్ అందించే ఒక స్మార్ట్ AC ని కనుక మ్రు కొనాలనుకుంటే ఇన్వర్టర్ టెక్నలాజి కలిగిన AC ని ఎంచుకోవడం ఉత్తమం. ఎందుకంటే, ఇన్వర్టర్ టెక్నలాజి AC లు అతితక్కువగా విద్యుత్తును వినియోగించుకుని పనిచేస్తాయి. కాబట్టి, మీకు తక్కువగా కరెంట్ బిల్ వస్తుంది. అంతేకాకుండా, ఇందులో అందించే సాంకేతికతతో  AC యొక్క కంప్రెషర్ ఎక్కువ కాలంగా పనిచేస్తుంది.

5. అధనపు ఫీచర్లు

ఒక AC ఎంచుకునేప్పుడు ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. సామాన్యంగా, మనకు చాల ఎంపికలతో AC లు దొరుకుతుంటాయి కానీ మన ఇంటి వాతవరణ పరిస్థితులకు అనుగుణమైన ఫిచర్లు కలిగిన వాటిని తెలుసుకుని ఎంచుకోవాలి. ఉదాహరణకు, మీ ప్రాంతంలో హ్యుమిడిటీ ఎక్కువగా ఉంటే గనుక దానికి అనుగుణంగా హ్యూమిడిఫైర్ కలిగిన AC ని ఎంచుకోవాలి. అలాగే, బ్యాక్టీరియా ని తొలగించే ఎంపిక మరియు అనేక విధాలైన మాకు కావాల్సిన వాటిని ఎంచుకొని వాటన్నిటిని కలిగిన ఒక మంచి AC ఎంచుకోండి.

దీని గురించి ఇంతగా ఎందుకు ఆలోచించాలంటే, ఒక సారి కొంటే  AC ని మళ్లి మళ్లి మార్చలేము కదా, అందుకే మీ డబ్బుకు తగిన విలువను అందిచే సరైన AC కొనండి. 

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: how to buy a good air condition in online
Tags:
best ac air conditioner air conditioner buying guide how to buy best ac in online online ac buying guide
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
hot deals amazon
Philips HR3705/10 300-Watt Hand Mixer, Black
Philips HR3705/10 300-Watt Hand Mixer, Black
₹ 2019 | $hotDeals->merchant_name
VEGA Insta Glam Foldable 1000 Watts Hair Dryer With 2 Heat & Speed Settings (VHDH-20)- White
VEGA Insta Glam Foldable 1000 Watts Hair Dryer With 2 Heat & Speed Settings (VHDH-20)- White
₹ 503 | $hotDeals->merchant_name
Professional Feel 260 Watt Multifunctional Food Mixers
Professional Feel 260 Watt Multifunctional Food Mixers
₹ 480 | $hotDeals->merchant_name
KENT Hand Blender 150W (16050), 5 Speed Control, 100% Copper Motor, Multiple Beaters, Overheating Protection, Food Grade Plastic Body
KENT Hand Blender 150W (16050), 5 Speed Control, 100% Copper Motor, Multiple Beaters, Overheating Protection, Food Grade Plastic Body
₹ 1275 | $hotDeals->merchant_name
Tanumart Hand Mixer 260 Watts Beater Blender for Cake Whipping Cream Electric Whisker Mixing Machine with 7 Speed (White)
Tanumart Hand Mixer 260 Watts Beater Blender for Cake Whipping Cream Electric Whisker Mixing Machine with 7 Speed (White)
₹ 599 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status