ఆన్లైన్ లో మీ EPF నుండి అడ్వాన్స్ కోసం ఎలా అప్లై చెయ్యాలి..!!

ఆన్లైన్ లో మీ EPF నుండి అడ్వాన్స్ కోసం ఎలా అప్లై చెయ్యాలి..!!
HIGHLIGHTS

PF నుండి కొంత మొత్తాన్ని అడ్వాన్స్ రూపంలో తీసుకునే అవకాశాన్ని ప్రభుత్వం అందించింది

EPF అకౌంట్ నుండి అడ్వాన్స్ కోసం అప్ప్లై చేయవచ్చు

ఉద్యోగస్తులు కొన్ని అనివార్య పరిస్తుతుల్లో అభ్యర్ధన చేసుకోవచ్చు

ప్రైవేట్ ఉద్యోగి  ప్రావిడెంట్ ఫండ్ (PF) రూపంలో సేవ్ చేసిన డబ్బు వారికీ ఆపత్కాలంలో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అందుకోసమే, ఉద్యోగస్తులు కొన్ని అనివార్య పరిస్తుతుల్లో తమ PF నుండి కొంత మొత్తాన్ని అడ్వాన్స్ రూపంలో తీసుకునే అవకాశాన్ని అందించింది. కాబట్టి, ఉద్యోగి కొన్ని ప్రత్యేక మరియు తప్పనిసరి పరిస్థితులలో వారి EPF అకౌంట్ నుండి అడ్వాన్స్ కోసం అప్ప్లై చేయవచ్చు. మరి ఉద్యోగి ప్రావిడెంట్ ఫండ్ అడ్వాన్స్ కోసం అప్లై చెయ్యాలో ఈరోజు చూద్దాం.  

ఎటువంటి పరిస్థితుల్లో EPF అడ్వాన్స్ కోసం అప్లై చేయవచ్చు?

వైద్య సహాయం, పెళ్లి , ఇల్లు కట్టుకోవడానికి లేదా ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి, సొంత ఇంటి లోన్ తిరిగి చెల్లించడానికి, చదువు , వంటి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో EPF నుండి కొంత మొత్తాన్ని అడ్వాన్స్ గా పొందడానికి అభ్యర్ధన చేసుకోవచ్చు.

ముందుగా EPFO యొక్క అధికారక వెబ్సైట్ లోకి ప్రవేశించి, మీ యొక్క UAN (యూనివర్సల్ అకౌంట్ నంబర్) ని యాక్టీవేట్ చేసుకోవాలి( ఇప్పటి వరకు చేయని వారికోసం).

EPF నుండి అడ్వాన్స్ కోసం ఎదురుస్తున్నవారు, వారి అభ్యర్థనను ఆన్లైన్లో EPFO వెబ్సైట్ ద్వారా సమర్పించవచ్చు. మీ UAN మరియు రిజిస్టర్డ్ మొబైల్ నంబరుతో ఇక్కడ  మేము సూచించిన విధంగా చేయండి.

1. మొదట మీరు www.epfindia.gov.in వెబ్సైటుకు వెళ్లి ఇక్కడ చూపిన విధంగా క్లిక్ చేయండి .

2.  తర్వాత మీరు UAN / ఆన్లైన్ సర్వీస్ (OCS / OTP) యొక్క సభ్యునికి దాని సర్వీసు పేజీకి మళ్ళించబడతారు.

3. సర్వీసుల కింద సభ్యుని UAN / ఆన్లైన్ సర్వీస్ (OCS / OTP) పై క్లిక్ చేసిన తర్వాత మీరు మీ UAN మరియు పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన పట్టికలో టైప్ చేయండి.

4. మీ UAN మరియు పాస్ వర్డు టైప్ చేసి  ఎంటర్ చేసిన తర్వాత, మీరు Manage పైన నొక్కండి. ఆ తర్వాత దానిలో కనిపించే 4 విభాగాలలో KYC పైన క్లిక్ చేయండి.

5. ఈ KYC లో మీ యొక్క ఆధార్, PAN మరియు బ్యాంకు వివరాలను నమోదుచేసి ఎంటర్ చేయండి. (ఈ వివరాలను ఇప్పటి వరకు నమోదు చేయని వారికోసం) ఇవి మీకు అప్డేట్ అవడానికి కొంత సమయం పడుతుంది.

6. ఇప్పుడు పైన కనిపించే, Online Services పైన నొక్కడం ద్వారా లోనికి ప్రవేశించి, అందులోని Claim ఎంచుకోండి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ యొక్క చివరి 4 అంకెలను నమోదు చేసి ఎంటర్ చేయండి.

7.  ఇక్కడ మీ వివరాలతో పాటుగా 'I  Want To Apply For' అని కనిపిస్తుంది. ఇందులోకి వెళ్లి PF Advance (Form-31) ఎంచుకొని మీరు ఎటువంటి అవసరం కోసం మీరు  మీ PF నుండి అడ్వాన్స్ కోసం అప్ప్లై చేస్తున్నారో ఎంచుకొవాల్సివుంటుంది.

8. ఇక్కడ మీ పూర్తి చిరునామా నమోదు  చేసిన తరువాత సబ్మిట్ చేయాలి.

9. ఆన్లైన్ అవకాశం లేనివారు EPF ఆఫీసునందు Form – 31 పూర్తి వివరాలను వ్రాసి సమర్పించవచ్చు.

ముఖ్య గమనిక :మీరు మీ (బ్యాంకు) వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్ చేసే ముందు వివరాలు సరైనవేనని పూర్తిగా నిర్ధారించుకున్న తరువాతే ముందుకు వెళ్ళండి.  ఎందుకంటే, మీ బ్యాంకు వివరాలు తప్పుగా ఎంటర్ చేస్తే మీ డబ్బు ఆ అకౌంటుకు వెళుతుంది.

ముఖ్యమైన అభ్యర్ధన : మీరు అత్యవసర సమయంలో ఉన్నప్పుడు, మీకు ఎటువంటి దారిలేనప్పుడు మరియు తప్పని పరిస్థితుల్లో తప్ప, మీ PF అడ్వాన్స్ ని వాడుకోకండి. ఎందుకంటే, ఇది మీకు మీ రిటైర్మెంట్ తరువాత ఉపయోగపడే ఒకే ఒక ఆధారం.     

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo