ఇంట్లో కూర్చొనే మీ EPF క్లెయిమ్ పొందవచ్చు..!!

HIGHLIGHTS

ఆన్లైన్లో EPF ని సెటిల్ చేసుకోవచ్చు.

EPF ని ఇంట్లో కూర్చొని మొబైల్ ఫోన్ ద్వారా సెటిల్ చేసుకోవచ్చు

ఆన్లైన్ పద్దతిలో చాల సులభముగా పొందవచ్చు

ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ క్లెయిమ్ కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. కొత్త ఆన్లైన్ పద్దతి ద్వారా PF క్లెయిమ్ సెటిల్మెంట్ లు చాలా సులభంగా మరియు వేగంగా పూర్తి క్లోజ్ చేయబడుతున్నాయి. అంటే, మీ PF క్లెయిమ్ కోసం ఎక్కడికీ వెళ్లే పనిలేకుండా, ఇంట్లో కూర్చొనే మీ మొబైల్ ఫోన్ ల ద్వారా సెటిల్ చేసుకోవచ్చు. మరి ఇంత సులభమైన ఆన్లైన్ పద్దతి గురించి అందిరికి తెలియడం మంచిదే కదా, మీరు తెలుసుకోండి.

వాస్తవానికి, గతంలో తమ ప్రోవిడెంట్ ఫండ్ అకౌంటులోని అమౌంటును తీసుకోవడానికి, తను పనిచేసిన ఆఫీసు మరియు EPFO ఆఫీసు చుట్టూ అనేక సార్లు తిరగవలసి వచ్చేది. అయితే, ఇపుడు అటువంటి ఇబ్బంది లేకుండా, కేవలం ఆన్లైన్లో ఒక అప్లికేషన్ ఇవ్వడం ద్వారా ఈ EPF ని సెటిల్ చేసుకోవచ్చు. అటువంటి సులభమైన పద్దతిని గురించి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడం మంచింది.

అయితే, ఈ EPFO లో మీ వివరాలను, ముఖ్యంగా మీ బ్యాంకు ఖాతాను ఎంటర్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు సరిగా చూసుకుని, చెక్ చేసుకుని మరి ఎంట్రీ చేయాలి. ఒకవేళ, తప్పుగా ఎంటర్ చేస్తే మీ అమౌంట్ మీరు తప్పుగా ఎంటర్ చేసిన ఆ బ్యాంకు ఖాతాకు మళ్ళించబడుతుంది. కాబట్టి, జాగ్రత్తగా ఎంటర్ చేయండి.

ఇది చాలా సులభమైన పద్ధతి.

EPF క్లెయిమ్ చేయడం ఎలా?

ముందుగా EPFO యొక్క అధికారక వెబ్సైట్ లోకి ప్రవేశించి, మీ యొక్క UAN (యూనివర్సల్ అకౌంట్ నంబర్) ని యాక్టీవేట్ చేసుకోవాలి( ఇప్పటి వరకు చేయనివారికోసం). వెబ్సైట్ కోసం EPFO  పైన క్లిక్ చేయండి.    

వారి సంస్థ నుండి EPF డబ్బు బదిలీ కోసం ఎదురుస్తున్నవారు మీ అభ్యర్థనను,  ఆన్లైన్లో EPFO ​​వెబ్సైట్ ద్వారా సమర్పించవచ్చు. మీ UAN మరియు రిజిస్టర్డ్ మొబైల్ నంబరుతో ఇక్కడ  మేము సూచించిన విధంగా చేయండి.

1. మొదట మీరు EPF వెబ్సైటుకు వెళ్లి  చూపిన విధంగా క్లిక్ చేయండి .

2. Employee పై క్లిక్ చేసిన తర్వాత మీరు UAN / ఆన్లైన్ సర్వీస్ (OCS / OTP) యొక్క సభ్యునికి దాని సర్వీసు పేజీకి మళ్ళించబడతారు.

3. సర్వీసుల కింద సభ్యుని UAN / ఆన్లైన్ సర్వీస్ (OCS / OTP) పై క్లిక్ చేసిన తర్వాత మీరు మీ UAN మరియు పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన పట్టికలో టైప్ చేయండి.

4. మీ UAN మరియు పాస్ వర్డు టైప్ చేసి  ఎంటర్ చేసిన తర్వాత, మీరు Manage పైన నొక్కండి. ఆ తర్వాత దానిలో కనిపించే 4 విభాగాలలో KYC పైన క్లిక్ చేయండి.

5. ఈ KYC లో మీ యొక్క ఆధార్, PAN మరియు బ్యాంకు వివరాలను నమోదుచేసి ఎంటర్ చేయండి. (ఈ వివరాలను ఇప్పటి వరకు నమోదు చేయని వారికోసం) ఇవి మీకు అప్డేట్ అవడానికి కొంత సమయం పడుతుంది.

6. ఇప్పుడు పైన కనిపించే, Online Services పైన నొక్కడం ద్వారా లోనికి ప్రవేశించి, అందులోని Claim ఎంచుకోండి. ఇక్కడ మీ వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :