మరో వారంలో ముగియనున్న BSNL Super Offer మిస్ చేసుకోకండి.!

HIGHLIGHTS

మరో వారంలో ముగియనున్న BSNL Super Offer మిస్ చేసుకోకండి

ఊహించనంత తక్కువ రీఛార్జ్ తో అందుకునేలా బిఎస్ఎన్ఎల్ ఈ ఆఫర్ ని ప్రకటించింది

ఈ అద్భుతమైన అవకాశాన్ని అందుకోండి అని బిఎస్ఎన్ఎల్ చెబుతోంది

మరో వారంలో ముగియనున్న BSNL Super Offer మిస్ చేసుకోకండి, అంటోంది ప్రభుత్వ టెలికాం కంపెనీ బిఎస్ఎన్ఎల్. ప్రజలందరికీ అధిక లాభాలను ఊహించనంత తక్కువ రీఛార్జ్ తో అందుకునేలా బిఎస్ఎన్ఎల్ ఈ ఆఫర్ ని ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ ని కేవలం లిమిటెడ్ టైం కోసం మాత్రమే అందించింది. ఈ ఆఫర్ ఏప్రిల్ నెల చివరితో ముగుస్తుంది. కాబట్టి, ఈ ఆఫర్ ముగిసే లోపల ఈ అద్భుతమైన అవకాశాన్ని అందుకోండి అని బిఎస్ఎన్ఎల్ చెబుతోంది.

BSNL Super Offer : ఏమిటి ఈ ఆఫర్

కేవలం ఒక్క రూపాయితో 30 రోజులు అన్లిమిటెడ్ లాభాలు ఆఫర్ చేసే బిఎస్ఎన్ఎల్ రూ. 1 లిమిటెడ్ పిరియడ్ ఆఫర్. ఇది బిఎస్ఎన్ఎల్ కొత్త యూజర్ల కోసం ప్రత్యేకంగా అందించిన సూపర్ అవుతుంది. అంటే బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డు తీసుకుని ఫస్ట్ రీఛార్జ్ చేసే వారికి ఈ ఆఫర్ లభిస్తుంది. ఇది బిఎస్ఎన్ఎల్ కొత్త కస్టమర్ల కోసం అందించిన ఎక్స్ క్లూజివ్ ఆఫర్. ఈ ఆఫర్ దేశవ్యాప్తంగా ఉన్న అందరికీ అందుబాటులో ఉంది.

మొదటగా 2025 ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బిఎస్ఎన్ఎల్ ఈ ఆఫర్ ని పరిచయం చేసింది. ఆ తర్వాత కూడా మరికొన్ని నెలలు ఈ ప్లాన్ ని బిఎస్ఎన్ఎల్ యూజర్ల కోసం అందుబాటులో ఉంచింది. అయితే, 2026 ప్రారంభం నుంచి ఈ ఆఫర్ ను పక్కన పెట్టింది. కానీ, ఈ సూపర్ ఆఫర్ ను తిరిగి తీసుకురావాలని వస్తున్న ప్రజల విన్నపాల కారణంగా ఈ ఆఫర్ ను మరోసారి తీసుకొచ్చినట్లు బిఎస్ఎన్ఎల్ తెలిపింది. ఈ ఆఫర్ ఏప్రిల్ 30వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంటే, ఈ బిఎస్ఎన్ఎల్ సూపర్ ఆఫర్ మరో వారంలో ముగుస్తుంది.

Also Read: Philips అవార్డ్ విన్నింగ్ Soundbar పై బిగ్ డీల్స్ అందుకోండి.!

BSNL Super Offer : ప్రయోజనాలు ఏమిటి?

బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ ఒక్క రూపాయి ఆఫర్ తో కొత్త సిమ్ కార్డు తీసుకుని రీఛార్జ్ చేసే యూజర్లకు నెల రోజుల పాటు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. ఈ ఆఫర్ తో 30 రోజులు వ్యాలిడిటీ లభిస్తుంది. కేవలం వ్యాలిడిటీ మాత్రమే కాదు 30 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100 SMS వినియోగ ప్రయోజనం కూడా అందిస్తుంది. ఇది కాకుండా 30 రోజులు డైలీ 2GB హై స్పీడ్ డేటా అందిస్తుంది మరియు ఈ డైలీ డేటా ముగిసిన తర్వాత కూడా 40Kbps వేగంతో అన్లిమిటెడ్ డేటా అందిస్తుంది.

పైన తెలిపిన అన్ని ప్రయోజనాలు కూడా బిఎస్ఎన్ఎల్ మీకు కేవలం రూ. 1 రూపాయికే అందిస్తుంది. ఈ అన్ని ప్రయోజనాలు ఒక్క రూపాయికే అందుకోవాలంటే బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న ఈ కొత్త ప్లాన్ తో రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :