kolkata police took action on vedu app after JioStar complaint
JioStar ఫిర్యాదుతో Vedu యాప్ పై కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇది కలకత్తా బెస్ట్ ఇల్లీగల్ స్ట్రీమింగ్ అప్లికేషన్ మరియు అనుమతి లేకుండా అన్ని రకాల కంటెంట్ లను ఈ యాప్ ద్వారా ప్రసారం చేస్తున్నారు. అయితే, ఈ యాప్ జియో హాట్ స్టార్ మరియు జియో సినిమా వంటి జియో స్టార్ ఇండియా కంటెంట్ ను కూడా ప్రచారం చేస్తున్నట్లు గుర్తించిన కంపెనీ, ఈ యాప్ పై ఫిర్యాదు చేశారు. ఈ కంప్లైంట్ అందుకున్న కోల్‌కతా సైబర్ క్రైమ్ పోలీసులు తీగ లాగితే డొంకంతా కదిలింది.
ఇక అసలు విషయానికి వస్తే, భారత డిజిటల్ వినోద రంగంలో అతిపెద్ద పైరసీ నెట్‌వర్క్ ను కోల్‌కతా సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు. ప్రముఖ మీడియా సంస్థ జిఓ స్టార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ పెద్ద నెట్ వర్క్ బయటపడింది. జియో హాట్ స్టార్ మరియు జియో సినిమా కంటెంట్ ను ‘వేడు’ యాప్ లో ప్రసారం చేస్తున్నట్లు గురించిన కంపెనీ, ఈ యాప్ పై ఫిర్యాదు చేసింది.
ఎటువంటి అనుమతులు లేకుండా అఫీషియల్ కంటెంట్ ను ఈ యాప్ ద్వారా ప్రసారం చేస్తున్నట్లు గురించిన కలకత్తా సైబర్ పోలీసులు, ఈ యాప్ నిర్వాహకుడుని అరెస్ట్ చేశారు. అతనితో పాటు ఒక ల్యాప్ టాప్, రెండు మొబైల్ ఫోన్లు, రౌటర్ మరియు మోడెమ్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు.
వేడు అనే యాప్ ద్వారా జియో స్టార్ యొక్క అఫీషియల్ తాజా సినిమాలు, వెబ్ సిరీస్ లు మరియు లైవ్ స్పోర్ట్స్ (క్రికెట్ మ్యాచ్ లు సహా) కంటెంట్ ను అనధికారికంగా ప్రసారం చేస్తున్నట్లు జియో స్టార్ ప్రతినిధుల నుంచి కంప్లైంట్ అందుకున్న కోల్‌కతా సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసును ఛేదించారు. మొత్తం కంటెంట్ కూడా అనుమతి లేకుండా ప్రసారం చేస్తున్నట్లు గుర్తించారు. విస్తుపోయే విషయం ఏమిటంటే, ఈ కంటెంట్ లో అధిక శాతం జియో స్టార్ వంటి అధికారిక ప్లాట్ ఫారమ్ లకు చెందినదే.
Also Read: 7.1.4 Dolby Atmos ప్రీమియం వైర్లెస్ సౌండ్ బార్ లాంచ్ చేసిన Boat
ఈ యాప్ వినియోగదారులకు ఉచితంగా కంటెంట్ ఇస్తున్నప్పటికీ, దాని వెనుక భారీ అక్రమ వ్యాపారం నడుస్తున్నట్లు కూడా గుర్తించారు. అదేమిటంటే, యాప్ లో వచ్చే ప్రకటనల ద్వారా ఆదాయం మరియు భారీ యూజర్ ట్రాఫిక్‌ను డబ్బుగా మార్చుకోవడం వంటి పక్కా వ్యాపారం చేస్తున్నట్లు కూడా గుర్తించారు. ఇది పూర్తిగా కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించే చర్యగా పోలీసులు పేర్కొన్నారు.
ఇది APK ఫైల్ యాప్ మరియు ఇలాంటి పైరసీ యాప్ లను ఉపయోగించడం వల్ల, యూజర్ మొబైల్ కు వైరస్ లు వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు, వ్యక్తిగత డేటా చౌర్యం మరియు చట్టపరమైన సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే, ఇలాంటి యాప్స్ మాయలో పడవద్దని సైబర్ వింగ్ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. ఏదైనా ఉచితంగా ఇస్తున్నారంటే, అక్కడ ‘ఆదాయ వనరు మీరే’ అని గమనించాలి.