7.1.4 Dolby Atmos ప్రీమియం వైర్లెస్ సౌండ్ బార్ లాంచ్ చేసిన Boat

HIGHLIGHTS

Boat మార్కెట్లో కంప్లీట్ వైర్లెస్ ప్రీమియం సౌండ్ బార్ విడుదల చేసింది

Aavante Prime X పేరుతో ఈ సౌండ్ బార్ ను మార్కెట్ లో ప్రవేశపెట్టింది

ఈ సౌండ్ బార్ 7.1.4 Dolby Atmos సౌండ్ సపోర్ట్ తో లాంచ్ అయ్యింది

7.1.4 Dolby Atmos ప్రీమియం వైర్లెస్ సౌండ్ బార్ లాంచ్ చేసిన Boat

ప్రముఖ భారతీయ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ Boat మార్కెట్లో కంప్లీట్ వైర్లెస్ ప్రీమియం సౌండ్ బార్ విడుదల చేసింది. Aavante Prime X పేరుతో ఈ సౌండ్ బార్ ను మార్కెట్ లో ప్రవేశపెట్టింది. ఈ సౌండ్ బార్ 7.1.4 Dolby Atmos సౌండ్ సపోర్ట్ తో లాంచ్ అయ్యింది. అయితే, ఇది 11.1 వంటి లీనమయ్యే సౌండ్ అందిస్తుందని బోట్ చెబుతోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Boat 7.1.4 Dolby Atmos సౌండ్ బార్: ప్రైస్

బోట్ ఈ సౌండ్ బార్ ను ప్రీమియం ఫీచర్స్ తో ప్రీమియం సెగ్మెంట్ లో విడుదల చేసింది. ఇక ఈ సౌండ్ బార్ ప్రైస్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ ను రూ. 37,999 ప్రైస్ ట్యాగ్ తో విడుదల చేసింది. ఈ సౌండ్ బార్ ఈరోజు నుంచి అమెజాన్ ఇండియా మరియు ఫ్లిప్ కార్ట్ తో పాటు బోట్ అఫీషియల్ సైట్ నుంచి కూడా లభిస్తుంది. Buy From Here

Boat 7.1.4 Dolby Atmos సౌండ్ బార్: ఫీచర్స్

ఈ సౌండ్ బార్ చాలా ప్రీమియం డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఈ సౌండ్ బార్ కంప్లీట్ వైర్లెస్ 7.1.4 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఈ సెటప్ లో ముందు 5 ఫ్రంట్ ఫైరింగ్, పెయిన్ రెండు అప్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన ప్రీమియం బార్, ముందు ఒకటి మరియు పైన ఒకటి స్పీకర్ కలిగిన డిటాచబుల్ వైర్లెస్ శాటిలైట్ స్పీకర్ సెటప్ కూడా ఉంటుంది. అంటే, ఈ డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ లను బార్ తో అటాచ్ చేసుకోవచ్చు మరియు డిటాచ్ చేసి రియర్ శాటిలైట్ స్పీకర్ గా ఉపయోగించుకోవచ్చు.

Boat 7.1.4 Dolby Atmos soundbar launched

ఈ సౌండ్ బార్ తో సూపర్ హార్డ్ అండ్ డీప్ బాస్ అందించే పవర్ ఫుల్ సబ్ కూడా వస్తుంది. ఈ టోటల్ సెటప్ తో ఈ సౌండ్ బార్ 700W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఓవరాల్ గా ఈ సౌండ్ బార్ సినిమా థియేటర్ ని మరిపించే సూపర్ సరౌండ్ అండ్ జబర్దస్త్ సౌండ్ అందిస్తుందని బోట్ గొప్పగా చెబుతోంది. ముఖ్యంగా, ఈ సౌండ్ బార్ కంప్లీట్ వైర్లెస్ సెటప్ తో వస్తుంద కాబట్టి సెటప్ చేయడం చాలా సులభం అవుతుంది.

Also Read: POCO C81 మరియు C81X బిగ్ బ్యాటరీతో లాంచ్ అయ్యాయి.. ఫోన్ ఎలా ఉందంటే.!

ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ లో USB, HDMI e-Arc, ఆప్టికల్, AUX ఇన్ మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఫుల్ ఫంక్షన్ రిమోట్ కంట్రోల్ తో కూడా వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo