7 వేల ధరలో లభించే బెస్ట్ Dolby Soundbar డీల్స్ ఇవిగో.!

HIGHLIGHTS

7 వేల ధరలో లభించే బెస్ట్ Dolby Soundbar డీల్స్

బడ్జెట్ ధరలో కూడా డాల్బీ సపోర్ట్ కలిగిన జబర్దస్త్ సౌండ్ బార్స్ లభిస్తున్నాయి

బెస్ట్ డిస్కౌంట్ తో ఈ రెండు సౌండ్ బార్ డీల్స్ లభిస్తున్నాయి

7 వేల ధరలో లభించే బెస్ట్ Dolby Soundbar డీల్స్ ఈరోజు చూడనున్నాము. బడ్జెట్ సౌండ్ బార్ అంటే సాదరంగా చిన్న చూపు ఉంటుంది. అయితే, పెరిగిన టెక్నాలజీ మరియు మార్కెట్లో నడుస్తున్న గొప్ప పోటీ కారణంగా ఇప్పుడు బడ్జెట్ ధరలో కూడా డాల్బీ సపోర్ట్ కలిగిన జబర్దస్త్ సౌండ్ బార్స్ లభిస్తున్నాయి. అలాంటి రెండు బెస్ట్ డాల్బీ సౌండ్ బార్ డీల్స్ ఈ రోజు ప్రత్యేకంగా అందిస్తున్నాను.

బెస్ట్ Dolby Soundbar డీల్స్

ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన బెస్ట్ డిస్కౌంట్ తో ఈ రెండు సౌండ్ బార్ డీల్స్ లభిస్తున్నాయి. ఇందులో ఒకటి PHILIPS యొక్క లేటెస్ట్ డాల్బీ డిజిటల్ సౌండ్ బార్ అయితే, రెండోది ZEBRONICS యొక్క డాల్బీ అట్మోస్ సౌండ్ బార్. ఈరోజు ఈ రెండు సౌండ్ బార్స్ కూడా ఫ్లిప్ కార్ట్ అందించిన డిస్కౌంట్ ఆఫర్స్ తో 6 వేల రూపాయలు బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి.

PHILIPS Dolby Soundbar

ఫిలిప్స్ యొక్క లేటెస్ట్ డాల్బీ డిజిటల్ సౌండ్ బార్ TAB4230/94D మోడల్ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ 65% భారీ డిస్కౌంట్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 6,999 ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ పై ఎటువంటి వడ్డీ లేకుండా No Cost EMI ఆఫర్ కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది.

ఈ సౌండ్ బార్ తక్కువ ధరలో వచ్చినా చాలా గొప్ప ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో రెండు డైనమిక్ స్పీకర్లు కలిగిన ప్రీమియం బార్ మరియు డీప్ బాస్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ టోటల్ 300W అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. ఇది డాల్బీ డిజిటల్ సౌండ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇందులో HDMI Arc, ఆప్టికల్, AUX మరియు బ్లూటూత్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.

Also Read: మరో వారంలో ముగియనున్న BSNL Super Offer మిస్ చేసుకోకండి.!

ZEBRONICS Dolby Atmos సౌండ్ బార్

ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ ను ఈరోజు ఫ్లిప్ కార్ట్ 73% డిస్కౌంట్ తో కేవలం రూ. 6,999 ధరలో సేల్ చేస్తోంది. ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి లభిస్తున్న డిస్కౌంట్ ధరలో ఇది అతి చవక ధరలో సబ్ ఉఫర్ తో లభించే ఏకైక సౌండ్ బార్ గా నిలుస్తుంది. ఈ సౌండ్ బార్ పైన కూడా 6 నెలలు నో కాస్ట్ EMI ఆఫర్ అందించింది.

ఇక ఈ జబ్రానిక్స్ సౌండ్ బార్ కలిగిన ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ 2.1 ఛానల్ డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇందులో క్వాడ్ స్పీకర్ సెటప్ కలిగి 160W సౌండ్ అందించే బార్ మరియు 140W జబర్దస్త్ బాస్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ ఉంటాయి. ఇది కూడా టోటల్ 300W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఇందులో కూడా ఆప్టికల్, AUX, HDMI Arc మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :