poco launched POCO C81 and POCO C81x in india
పోకు ఈరోజు తన బడ్జెట్ సిరీస్ అయిన C సిరీస్ నుంచి POCO C81 మరియు C81X స్మార్ట్ ఫోన్ లు లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్లను కూడా బిగ్ బ్యాటరీ మరియు స్లీక్ డిజైన్ తో లాంచ్ చేసింది. పోకో కొత్తగా విడుదల చేసిన ఈ రెండు బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.
పోకో ఈ రెండు స్మార్ట్ ఫోన్ లను సింగల్ వేరియంట్ తో బడ్జెట్ ధరలో లాంచ్ చేసింది. వీటిలో పోకో సి 81x ఫోన్ ను (3 జీబీ + 64 జీబీ) సింగల్ వేరియంట్ లో కేవలం రూ. 9,999 ధరతో లాంచ్ చేసింది. అలాగే, పోకో సి 81 స్మార్ట్ ఫోన్ ను (4 జీబీ + 64 జీబీ) సింగల్ వేరియంట్ లో రూ. 10,999 ధరతో రిలీజ్ చేసింది.
ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ పైన మంచి బ్యాంక్ ఆఫర్స్ అందించింది. ఈ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ Axis మరియు ఫ్లిప్ కార్ట్ SBI క్రెడిట్ కార్డ్ ఆప్షన్ పై రూ. 500 అదనపు డిస్కౌంట్ అందించింది. ఏప్రిల్ 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ స్మార్ట్ ఫోన్లు సేల్ కి అందుబాటులోకి వస్తాయి. ఈ ఫోన్ లను ఫ్లిప్ కార్ట్ ద్వారా పోకో సేల్ చేస్తుంది.
Also Read: Big Deal :అతి చవక ధరలో 55 ఇంచ్ QLED Smart Tv అందుకోండి.!
పోకో సి 81x స్మార్ట్ ఫోన్ ను 6.88 ఇంచ్ డిస్ప్లే ఆటో మరియు పోకో సి81 ఫోన్ ను మాత్రం 6.9 ఇంచ్ డిస్ప్లే తో లాంచ్ చేసింది. ఈ రెండు పోకో కొత్త ఫోన్ల డిస్ప్లేలు HD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తాయి. ఇక ప్రోసెసర్ విషయానికి వస్తే, ఈ రెండు పోకో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు కూడా UNISOC T7250 ఆక్టా కోర్ చిప్ సెట్ తో వచ్చాయి. అయితే, C81x ఫోన్ 3GB ర్యామ్ జతగా 64GB స్టోరేజ్ కలిగి ఉంటే, C81x మాత్రం 4GB ర్యామ్ జతగా 64GB స్టోరేజ్ కలిగి ఉంటుంది.
కెమెరా పరంగా, ఈ రెండు పోకో స్మార్ట్ ఫోన్లు కూడా 13MP AI రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా సెటప్ ని కలిగి ఉంటాయి. ఈ ఫోన్ లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ మరియు ఫిల్టర్లు కలిగి ఉంటుంది. బ్యాటరీ పరంగా ఈ రెండు ఫోన్లలో గొప్ప వ్యత్యాసం ఉంది. పోకో C81 ఫోన్ 6300 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటే, పోకో C81x మాత్రం 5200 mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. అయితే, ఈ రెండు ఫోన్లు కూడా 15W ఫాస్ట్ ఛార్జ్ మరియు 7.5W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ ను కలిగి ఉంటాయి.
ఈ రెండు పోకో ఫోన్లు IP52 రేటెడ్ డస్ట్ అండ్ వాటర్ స్ప్లాష్ రెసిస్టెన్స్ మరియు వాటర్ టచ్ 2.0 ఫీచర్ కూడా కలిగి ఉంటాయి.