5G నెట్‌వర్క్ ఇండియాలో ఎంత స్పీడ్ గా ఉంటుంది..!

5G నెట్‌వర్క్ ఇండియాలో ఎంత స్పీడ్ గా ఉంటుంది..!
HIGHLIGHTS

ఇండియాలో ఎక్కడ చూసినా సర్వత్రా 5G గురించే చర్చ

ఇండియాలో 5G సర్వీసులు ప్రారంభమయితే అవి ఎలా పనిచేస్తాయి

మీకు పూర్తి 5G స్పీడ్ ఎలా ఉంటుందో తెలుసా

4 జి నెట్వర్క్  సైద్ధాంతిక పరంగా సెకనుకు 100 మెగాబిట్స్ (Mbps) వేగంతో ప్రస్తుతానికి అగ్రస్థానంలో వుంది. అయితే,  5 జి విషయంలో మాత్రం మనం ఊహించని విధంగా ఇది సెకనుకు గరిష్టంగా 10 గిగాబిట్స్ (Gbps) తో వేగంతో ఉంటుంది. అంటే, 5 జి ప్రస్తుత 4 జి టెక్నాలజీ కంటే ఏకంగా వంద రెట్లు వేగంగా ఉంటుంది. ఉదాహరణకు, కన్స్యూమర్ టెక్నాలజీ అసోసియేషన్ యొక్క నివేదిక తెలిపిన ప్రకారం, మీరు 5G లో కేవలం 3.6 సెకన్లలో డౌన్లోడ్ చేసే పనిని, 4G లో అయితే 6 నిమిషాలు, 3G లో అయితే 26 గంటల డౌన్‌లోడ్ సమయం పడుతుంది.

ఇది వాస్తవానికి, అన్నింటికీ సంబంధించిన విషయం కాదు. అయితే, 5G  ఖచ్చితంగా జాప్యాన్ని(లెటెన్సీ) తగ్గిస్తుందని మాత్రం చెప్పొచ్చు. అనగా, ఇంటర్నెట్‌ లో ఏదైనా పనిని చేసేటప్పుడు, వేగవంతమైన లోడ్ టైం మరియు మంచి జవాబుదారీతనం మీకోసం నిర్మించబడతాయి.

ఈ వేగంతో, 5 జి ప్రస్తుత హోమ్ కేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్‌ లాగా కనిపిస్తుంది మరియు ఫైబర్‌ తో పోల్చవచ్చు. ల్యాండ్‌లైన్ ఇంటర్నెట్ కంపెనీలైన కామ్‌కాస్ట్, కాక్స్ మరియు ఇతరుల కంపెనీలు తీవ్రమైన పోటీని ఎదుర్కోవలసి ఉంటుంది – ప్రత్యేకించి అవి ఒక నిర్దిష్ట ప్రాంతంలో వేగంగా హోమ్ ఇంటర్‌నెట్ కోసం మాత్రమే ఎంపికగా ఉంటాయి. వైర్‌ లెస్ క్యారియర్లు భౌతికంగా ఎటువంటి వైర్లు లేకుండానే, ప్రతి ఇంటిలో ఇటువంటి సర్వీస్ ను అందించగలవు.

5G అన్నిచోట్లా మరియు అన్ని పరికరాల్లో సూపర్-ఫాస్ట్ గా అన్లిమిటెడ్ ఇంటర్నెట్‌ తో ప్రారంభించాలని అందరూ కోరుకుంటారు. వాస్తవానికి, వాస్తవ ప్రపంచంలో, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ప్రస్తుతం డేటా క్యాప్ తో ఛార్జ్ చేస్తున్నారు. ఉదాహరణకు, మీ వైర్‌ లెస్ క్యారియర్ మీకు 100 GB డేటా క్యాప్ ఇచ్చినప్పటికీ – ఇది ఈ రోజు అమలులో వున్న చాలా ప్లాన్ల కంటే చాలా పెద్దది – మీరు ఒక నిమిషం 20 సెకన్లలో గరిష్టంగా 10 Gbps థియరిటికల్ వేగంతో డేటాని అందుకోవచ్చు. అయితే, సంస్థలు చివరికి ఎటువంటి ప్రణాళికలను విధిస్తాయనేది అస్పష్టంగా ఉంది, కాబట్టి  వినియోగాన్ని ఇది ఎంత ప్రభావితం చేస్తుంది అని చూడాలి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo