హీరో ఎలక్ట్రిక్ రోజూవారి అవసరాలకు ఉపయోగపడేలా కొత్త ఎలక్ట్రి స్కూటర్ ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా తక్కువ బరువుతో ఉండడమే కాకుండా మంచి డిజైన్ తో అందించినట్లు కంపెనీ తెలిపింది. కానీ, ఈ లేటెస్ట్ ఈ-స్కూటర్ Eddy ని తక్కువ దూరం ప్రయాణించే వారి కోసం రూపొందించబడింది. రోజు మీరు తక్కువ దూరం ప్రయాణించే వారైతే కనుక మీకు ఈ స్కూటీ సరిగ్గా సరిపోతుంది, అని కంపెనీ చెబుతోంది.
Survey
✅ Thank you for completing the survey!
Eddy Electric Scooter: ధర మరియు ఫీచర్లు
కొత్త హీరో ఎడ్డీ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.72,000 (ఎక్స్-షోరూమ్) గా వెల్లడించింది. ఎల్లో మరియు లైట్ బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ స్కూటర్ అందుబాటులో ఉంటుంది. అయితే, కంపెనీ ఇంకా తన వెబ్‌సైట్‌లో స్కూటర్‌ను లభించనున్న ప్రాంతాలను జాబితా చేయలేదు.
ఇక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్ల విషయానికి వస్తే, రిజిస్ట్రేషన్ మరియు లైసెన్స్ అవసరం లేకుండా వచ్చే ఈ స్కూటర్ కేవలం 25 కిలో మీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణిస్తుంది. అలాగే, హీరో ఎలక్ట్రిక్ యొక్క అధికారిక వెబ్సైట్ నుండి అందించిన స్పెక్స్ షీట్ ప్రకారం ఒక్కసరి ఫుల్ ఛార్జ్ తో 85 కిలోమీటర్ల దూరం వరకూ ప్రయాణించగలదు.
Hero Eddy ఫైండ్ మై బైక్, e-లాక్, ఫాలో మీ హెడ్‌ల్యాంప్స్ మరియు రివర్స్ మోడ్ వంటి ఫీచర్లను కూడా కలిగివుంది. కాబట్టి, రోజువారీ లోకల్ అవసరాలకు ఇది గొప్ప ఎలక్ట్రిక్ స్కూటర్‌గా మారుతుంది.