మీ పేరు మీద ఇంకెవరైనా SIM కార్డ్ వాడుతున్నారామో, ఇలా చెక్ చెయ్యండి

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 14 Sep 2021
HIGHLIGHTS
  • ఎన్ని మొబైల్ నంబర్లు మీ పేరు మీద ఇంకా యాక్టివ్ గా ఉన్నాయో తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు

  • మీకు సంబంధించిన అన్ని మొబైల్ నంబర్ల వివరాలను ఇన్స్టాంట్ గా తెలుసుకోవచ్చు.

  • చిటికెలో మీ పేరు మీదున్న యాక్టివ్ నంబర్లను చెక్ చేసుకోవచ్చు

మీ పేరు మీద ఇంకెవరైనా SIM కార్డ్ వాడుతున్నారామో, ఇలా చెక్ చెయ్యండి
మీ పేరు మీద ఎన్ని మొబైల్ నంబర్స్ ఇప్పటికీ యాక్టివ్ గా ఉన్నాయో చెక్ చేసుకోండి?

షాకింగ్ నిజం: ఇంకా ఇన్ని మొబైల్ నంబర్స్ మీ పేరు మీద యాక్టివ్ గా ఉన్నాయా?  ఇప్పటి కూడా ఎన్ని మొబైల్ నంబర్లు మీ పేరు మీద ఇంకా యాక్టివ్ గా ఉన్నాయో తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.ఇప్పటి వరకూ నేరుగా వినియోగధారులకు దీని పైన పూర్తి ఇంఫర్మేషన్ లేనప్పటికీ, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (DoT) కొత్తగా తీసుకొచ్చిన టెలికం అనలైటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్ మెంట్ మరియు కన్స్యూమర్ ప్రొటక్షన్ (TAFCOP) నుండి మీకు సంబంధించిన అన్ని మొబైల్ నంబర్ల వివరాలను ఇన్స్టాంట్ గా తెలుసుకోవచ్చు.      

దీనికోసం,  ముందుగా మీ మొబైల్ ఫోన్ బ్రౌజర్ లేదా ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌లో tafcop.dgtelecom.gov.in వెబ్ సైట్ ని తెరవండి. తరువాత, ఇక్కడ సూచించిన వద్ద మీ మొబైల్ నంబర్‌ నమోదు చేయండి. క్రింద OTP రిక్వెస్ట్ కోసం  సూచించిన బాక్స్ పైన నొక్కండి. మీ మొబైల్ నంబర్ కు వచ్చిన OTP ని ఎంటర్ చేసి తనిఖీ చేయండి.

OTP ని ధృవీకరించిన తరువాత, మీ పేరులో పనిచేసే అన్ని మొబైల్ నంబర్స్ యొక్క పూర్తి జాబితాను మీరు అందుకుంటారు. వాటిలో, మీరు మీ సౌలభ్యం ప్రకారం ఏదైనా నంబర్ గురించి రిపోర్ట్ చెయవచ్చు. తరువాత, మీరు కోరుకున్న నంబర్ నడుస్తుంది మరియు మీరు ఫిర్యాదు చేసిన నంబర్లను ప్రభుత్వం తనిఖీ చేస్తుంది.

అయితే, ప్రస్తుతానికి ఈ tafcop.dgtelecom.gov.in వెబ్సైట్ కేవలం కొన్ని సర్కిల్స్ కోసం మాత్రమే విడుదల చేయబడింది. త్వరలోనే ఇది అన్ని సర్కిళ్లలో విడుదల అవుతుంది. ఒక ID గరిష్టంగా తొమ్మిది నంబర్ లను కలిగి ఉంటుంది, కానీ మీరు ఈ పోర్టల్‌లో మీరు ఉపయోగించని మొబైల్ నంబర్, మీ పేరు పైన కనిపిస్తే, మీరు ఆ నంబర్ గురించి ఫిర్యాదు చేయవచ్చు. ఆ తరువాత ప్రభుత్వం ఆ నెంబర్‌ ను బ్లాక్ చేస్తుంది.

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: have you checked how many mobile numbers still active on your name
Tags:
telugu news viral trending trending in telugu telugu tech news latest telugu news mobile numbers sim cards 4G 5G goolge trends telugu
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status