Happy Republic Day 2025: దేశం ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటోంది. జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాము. ఎందుకంటే ఈ రోజే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ రోజుతో భారతదేశం బ్రిటిష్ పాలన నుంచి పూర్తిగా విముక్తి పొంది, ఒక స్వతంత్ర రాజ్యంగా మారింది. జనవరి 26, 1950 సంవత్సరంలో మొదటి గణతంత్ర దినోత్సవ వేడుక జరిగింది. అప్పటి నుంచి గణతంత్ర దినోత్సవ పరేడ్ ప్రతి సంవత్సరం న్యూఢిల్లీలోని కర్తవ్య మార్గంలో జరుగుతుంది. ఈరోజు మీకు ప్రియమైన వారికి 2025 గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడానికి మరియు వీడియో స్టేటస్ కోసం మంచి ఐడియాలతో ఈరోజు మీ ముందుకు వచ్చాము.
వీడియో స్టేటస్ కోసం యూట్యూబ్ నుంచి చాలా రిపబ్లిక్ డే వీడియోలు అందుబాటులో ఉన్నాయి. యూట్యూబ్ డౌన్లోడర్ ద్వారా మీకు నచ్చిన వీడియోలను డౌన్లోడ్ చేసుకొని మీ వాట్సాప్ స్టేటస్ గా సెట్ చేసుకోవచ్చు.