Google-Jio Phone: త్వరలోనే చవక స్మార్ట్ ఫోన్లు

HIGHLIGHTS

ఇటీవల Google CEO చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది

త్వరలోనే Google - Jio చవక స్మార్ట్ ఫోన్లు

Google మరియు Jio ఉమ్మడిగా అతి చవక ధరకే స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ

Google-Jio Phone: త్వరలోనే చవక స్మార్ట్ ఫోన్లు

ఇటీవల Google CEO చేసిన ప్రకటన ఆసక్తికర చర్చనీయాంశంగా మారింది. ఇండియాలో బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెట్టడానికి  చాలా క్లోజ్ గా రిలయన్స్ జియో తో పనిచేస్తున్నట్లు, Google CEO సుందర్ పిచ్చాయ్ తెలిపారు. దీన్ని బట్టి చూస్తుంటే, త్వరలోనే Google – Jio చవక స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో ప్రకటించవచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. చవక ధరలో స్మార్ట్ ఫోన్లను తీసుకురావడం ద్వారా ఇప్పటికి 2G నే కొనసాగిస్తున్న వారికీ కూడా లేటెస్ట్ టెక్నాలజీని చేరువ చేసే వీలుంటుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ముందుగా, గత సంవత్సరం Google సంస్థ 33 వేల కోట్లతో 7.7 శాతం జియో వాటిని చేజిక్కుంచుకుంది.  అయితే, కొత్తగా వచ్చిన ఈ న్యూస్ మాత్రం వర్చువల్ కాన్ఫరెన్స్ లో జరిగినట్లు తెలుస్తోంది. Google మరియు Jio ఉమ్మడిగా అతి చవక ధరకే స్మార్ట్ ఫోన్ టెక్నాలజీని భారతీయలకు అందిచే ప్రయత్నాలు చేస్తున్నాయని మనం అర్ధం చేసుకోవచ్చు.

దీన్ని బట్టి చూస్తుంటే, అతి త్వరలోనే ఇండియాలో గూగుల్ మరియు జియో జతగా సరసమైన ధరలో స్మార్ట్ ఫోన్లను ప్రకటించవచ్చని ఊహిస్తున్నారు. అంతేకాదు, ఇప్పటికే తక్కువ ధరలో ఎక్కువ లాభాలనిచ్చే ప్లాన్స్ అందిస్తున్న జియో మరిన్ని ప్లాన్స్ కూడా అందించవచ్చని కూడా అంచనా వేస్తున్నారు.                    

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo