Hackers కి AI సహాయం .. ఏఐతో సైబర్ దాడులు.. కొత్త ముప్పు గురించి హెచ్చరించిన గూగుల్.!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఇప్పుడు లాభాల కంటే నష్టాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి
సైబర్ నేరగాళ్ల తెలివికి ఏఐ సహాయంతో అనుకోని స్థాయిలో మోసాలు పెరుగుతున్నట్లు హెచ్చరిస్తున్నారు
ఈ విషయాన్ని గూగుల్ థ్రెట్ ఇంటెలిజెన్స్ గ్రూప్ (GTIG) తన తాజా AI Threat Tracker నివేదికలో వెల్లడించింది
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఇప్పుడు లాభాల కంటే నష్టాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సైబర్ నేరగాళ్లు తమ తెలివితో చాలా కాలంగా అమాయకులను మోసం చేయడం విన్నాము. ఇప్పుడు సైబర్ నేరగాళ్ల తెలివికి ఏఐ సహాయం చేయడం తో అనుకోని స్థాయిలో మోసాలు పెరుగుతున్నట్లు హెచ్చరిస్తున్నారు. Hackers కి AI సహాయం చేయడంతో ఏఐతో సైబర్ దాడులు అధికం అయ్యాయి అని కొత్త ముప్పు గురించి గూగుల్ హెచ్చరించింది. ఈ విషయాన్ని గూగుల్ థ్రెట్ ఇంటెలిజెన్స్ గ్రూప్ (GTIG) తన తాజా AI Threat Tracker నివేదికలో వెల్లడించింది.
Hackers కి AI సహాయం చేయడం ఏమిటి?
సైబర్ నేరగాళ్లు సాధారణ ఏఐ చాట్ బాట్ లను ఉపయోగించడం నుంచి మల్టీ ఏజెంట్ ఏఐ వ్యవస్థల వైపు మారుతున్నట్లు నిన్న విడుదలైన GTIG నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం, ARTEX, CAIRN, Cyber Strike AI మరియు Pent AGI వంటి ఓపెన్ సోర్స్ ఫ్రేమ్ వర్క్ లను ఉపయోగించి నెట్ వర్క్ లను పరిశీలించడం మరియు వాటిలో ఉన్న బలహీనతలను గుర్తించి వాటిని ఉపయోగించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరింత ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, వీటిలో కొన్ని సందర్భాల్లో ఈ ప్రక్రియలో మానవ ప్రమేయం కూడా తగ్గిపోతోంది. అంటే, పూర్తిగా ఏఐ ఆటోమేషన్ ద్వారా ఈ పనులు జరిగిపోతున్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు.
ఇందులో మరో కీలకమైన అంశం సాఫ్ట్ వేర్ భద్రతకు సంబంధించినది. కొత్త సెక్యూరిటీ ప్యాచ్ లు విడుదలైన తర్వాత పాత, కొత్త కోడ్ లను పోల్చి వాటిలోని లోపాలను గుర్తించడానికి ఏఐని ఉపయోగిస్తున్నారు. ఆ లోపాలను ఆధారంగా చేసుకుని దాడులకు అవసరమైన కోడ్ ను కూడా ఆటోమేటిక్ గా రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని గూగుల్ తెలిపింది. ఇది నిజంగా ఏఐ గురించి చాలా ఆలోచింప చేసే విషయం.