ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇక నుండి కాల్ రికార్డింగ్ యాప్స్ ఉండవు..!!

ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇక నుండి కాల్ రికార్డింగ్ యాప్స్ ఉండవు..!!
HIGHLIGHTS

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో కనుమరుగుకానున్న కాల్ రికార్డింగ్ యాప్స్

తర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్ యాప్స్ ను ప్లే స్టోర్ నుండి గూగుల్ పూర్తిగా నిలిపివేయనుంది

కొత్త అప్డేట్స్ తో Google మరింత ఉచ్చును బిగించడం ప్రారంభించింది

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో కనుమరుగుకానున్న కాల్ రికార్డింగ్ యాప్స్. ఎందుకంటే, Play Store కొత్త పాలసీ అప్డేట్ తో థర్డ్-పార్టీ యాప్స్ రిమోట్ కాల్ రికార్డింగ్ కోసం Accessibility API ని అభ్యర్థించకుండా నిరోధిస్తుంది. అంటే సరళమైన భాషలో చెప్పాలంటే, తర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్ యాప్స్ ను ప్లే స్టోర్ నుండి గూగుల్ పూర్తిగా నిలిపివేయనుంది.        

2020 చివరిలో, Samsung మరియు Vivo తో తప్ప మిగిలిన అన్ని OEMS కూడా ఆటోమేటిక్ కాల్ రికార్డింగ్‌కు సపోర్ట్ చెయ్యని  Google డయలర్‌ ను పాత కస్టమ్ డయలర్‌ స్థానంలో భర్తీ చేశాయి. అయితే, ఈ ఫీచర్ కోసం గూగుల్ ప్లే స్టోర్ నుండి చాలా తర్డ్ పార్టీ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ, సెక్యూరిటీ మరియు ప్రైవసీ వంటి సున్నితమైన అంశాల కారణంగా గూగుల్ వీటిని పరిమితం చేసింది. అంతేకాదు, వీటిలో ఏ యాప్స్ కూడా పూర్తి పరిష్కారాన్ని అందించవు.

ఇది ఇలా ఉంటే కాలింగ్ రికార్డింగ్ యాప్స్ పూర్తి స్థాయి పరిష్కారాన్ని అందించని యాప్స్ నిర్వీర్యం చేయడానికి Google మరింత దూకుడుగా వ్యవహరిస్తూ వస్తోంది. కొత్త అప్డేట్స్ తో Google మరింత ఉచ్చును బిగించడం ప్రారంభించింది అనడంలో ఆశ్చర్యం లేదు. ముందుగా, ఆండ్రాయిడ్ 6.0 తో కాల్ రికార్డింగ్ API ని Google నిలిపివేసింది. తరువాత, ఆండ్రాయిడ్ 10 తో మైక్రోఫోన్‌ లలో కాల్ రికార్డింగ్‌ ని బ్లాక్ చేసింది. ఈ చర్య తరువాత నుండి డెవలపర్లు మైక్రోఫోన్ ద్వారా కాల్‌ లను రికార్డ్ చేయడానికి Accessibility API ని ఉపయోగిస్తున్నారు.

Play Store కొత్త పాలసీ అప్డేట్ ఇప్పుడు థర్డ్-పార్టీ యాప్స్ రిమోట్ కాల్ రికార్డింగ్ కోసం Accessibility API ని అభ్యర్థించకుండా నిరోధిస్తుంది. ఈ మార్పు మే 11, 2022 నుండి అమలులోకి వస్తుందని గూగుల్ తెలిపింది. అయితే, ముందుగా లోడ్ చేయబడిన యాప్స్ కాల్ రికార్డింగ్‌కు మద్దతునిస్తూనే ఉంటాయి. ఈ మార్పు కేవలం థర్డ్-పార్టీ యాప్‌ లను మాత్రమే ప్రభావితం చేస్తుందని మరియు ఫోన్స్ లో ముందుగా లోడ్ చేసిన కాల్ రికార్డింగ్ యాప్స్ ప్రభావితం కాబోవని Google స్పష్టం చేసింది.

OnePlus, Oppo, Realme, Xiaomi మరియు Pocoతో సహా భారతదేశంలోని చాలా Android ఫోన్‌ లలో Google డయలర్‌ ను ప్రాథమిక డయలర్ APP గా ఉపయోగిస్తున్నాయి. Google డయలర్‌ సపోర్ట్ ఉన్నవారికి కాల్ రికార్డింగ్‌ అనుమతిస్తుంది. కానీ, కాలర్ మరియు రిసీవర్ ఇద్దరికీ వినిపించే ప్రాంప్ట్‌ తో రికార్డింగ్ ప్రారంభమవుతుంది మరియు ఆటోమేటిక్ కాల్ రికార్డింగ్ కోసం ఎంపిక కూడా లేదు. అయితే, Samsung మరియు Vivo ఇప్పటికీ కస్టమ్ డయలర్‌ లను ఉపయోగిస్తున్న రెండు ప్రసిద్ధ Android OEMలు మరియు ఇవి ఇప్పటికీ ఆటో కాల్ రికార్డింగ్ ఎంపికను అందిస్తూనే ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo