GOOGLE డూడుల్ గీయండి 5 లక్షలు సొంతం చేసుకోండి

GOOGLE డూడుల్ గీయండి 5 లక్షలు సొంతం చేసుకోండి
HIGHLIGHTS

ఈ డూడుల్ గీయడానికి స్కెచ్ లేదా కలర్, క్రయాన్స్ లేదా గ్రాఫిక్ డిజైన్ ఎటువంటిదైనా ఉపగించవచ్చు.

గూగుల్, త్వరలో రానున్న 2019 బాలల దినోత్సవం సందర్భరంగా పిల్లల కోసం మంచి కాంటెస్ట్ తీసుకొచ్చింది,. ఇందులో గెలిచిన వారికీ అక్షరాలా 5 లక్షల రూపాయలను అందించనుంది. అంతేకాదు,  2019 బాలల దినోత్సవం రోజున మీరు గీసిన గూగుల్ డూడుల్ ని ప్రపంచం మొత్తం చూసే అరుదైన అవకాశం కూడా అందిస్తుంది. ఈ అవకాశాన్ని 1 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు చదువుకునే పిల్లకు కోసం మాత్రమే వర్తిస్తుంది.

మీ పిల్లలు బొమ్మలు బాగా గీయగలరా ? లేదా మీ పిల్లలు మంచి భావనాలు గల వారా? అయితే, ఈ మాట వినంగానే పిల్లలు ఎగిరి గంతేస్తారు. ఎందుకంటే, వారి టాలెంట్ ని నిరూపించుకోవడానికి ఇది ఒక సదావకాశం. అయితే, ఈ పోటీలో పాల్గొనే వారు వారికీ నచ్చిన బొమ్మలను గీయ కూడదు, ఈ గూగుల్ డూడుల్ కోసం ఒక థీమ్ అందించింది. 'When I Grow Up, I Hope'  అంటే 'నేను పెద్దయ్యాక, ఇలా ఆశిస్తున్నాను'   అనే థీమ్ ఉండేలా గూగుల్ డూడుల్ ని చిత్రించాలి.

అంటే, నేను పెద్దయ్యాక మన దేశం లేదా మన టెక్నాలజీ లేక మరేదైనా ఎలా ఉంటే వహుడాలని ఆశిస్తున్నారో, దాన్ని థీమ్ గా అందించాలి. ఈ కాంటెస్ట్ ఆగష్టు 1వ తేదీ నుండి సెప్టెంబర్ 30 వ తేదీ వరకు అందరికి అందుబాటులో ఉంటుంది. అయితే, ఇందులో GOOGLE అనే పదం కొట్టిచ్చినట్లు కనపడాలి. ఈ డూడుల్ గీయడానికి స్కెచ్ లేదా కలర్, క్రయాన్స్ లేదా గ్రాఫిక్ డిజైన్ ఎటువంటిదైనా ఉపగించవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo