అలర్ట్: ఈ యాప్స్ మీ ఫోన్ లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి

అలర్ట్: ఈ యాప్స్ మీ ఫోన్ లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి
HIGHLIGHTS

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వాడుతున్నవారి కోసం గూగుల్ అలర్ట్

ఈ యాప్స్ మీ ఫోన్ లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి

ప్రైవసీ లేదా సెక్యూరిటీని భంగపరిచే యాప్స్

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వాడుతున్నవారి కోసం అలర్ట్. మీరు మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో ఈ యాప్స్ డౌన్ లోడ్ చేసుకొని ఉంటే వెంటనే డిలీట్ చేయండి. ఎందుకంటే, గూగుల్ తాజాగా Play Store  నుండి కొన్ని గుర్తుతెలియని (Unknown Source) యాప్స్ ని తొలిగించింది. యూజర్ల సౌకర్యార్ధం కొత్త యాప్స్ ను ప్రోత్సహించే గూగుల్, వినియోగదారుల ప్రైవసీ మరియు సెక్యూరిటీని పటిష్టంగా ఉంచేందుకు వారి ప్రైవసీ లేదా సెక్యూరిటీని భంగపరిచే యాప్స్ ను ప్లే స్టోర్ నుండి ఎప్పటికప్పుడు తొలగిస్తుంది.

ఇప్పుడు గూగుల్ తన ప్లే స్టోర్ నుండి ఒక 9 యాప్స్ ని గుర్తుతెలియని సోర్స్ నుండి వచ్చినవిగా గుర్తించి వెంటనే ప్లే స్టోర్ నుండి తొలిగించింది. వాస్తవానికి, ప్రతి యాప్ కూడా వాటి సరైన సోర్స్ వివరాలను కలిగివుండాలి. లేకుంటే, అవి యూజర్ ప్రైవసీ మరియు సెక్యూరిటీకి కలిగించేవిగా గుర్తిస్తారు. అందుకే, ఈ 9 యాప్స్ ని ప్లే స్టోర్ నుండి తొలిగించింది. కాబట్టి, ఈ 9 యాప్స్ కనుక మీ మోబైల్ లో ఉంటే వెంటనే డిలీట్ చెయ్యడం మంచిది. గూగుల్ డిలీట్ చేసిన ఆ 9 యాప్స్ ని ఈ క్రింద చూడవచ్చు.

1 .App Lock Keep

2 .Rubbish Cleaner

3. Horoscope Pi

4 .Horoscope Daily

5 .PiP Photo

6. App Lock Manager

7 .Lockit Master

8.  Inwell Fitness

9 . Processing Photo  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo