గూగుల్ క్రోమ్ మరియు Mozilla యూజర్లను హెచ్చరించిన భారత ప్రభుత్వం

HIGHLIGHTS

భారత ప్రభుత్వం గూగుల్ క్రోమ్ మరియు Mozilla యూజర్ల కోసం హెచ్చరికలను జారీచేసింది

CERT-In ఈ హెచ్చరికలను జారీ చేసింది

కొత్త అప్డేట్ ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవడం మంచిది

గూగుల్ క్రోమ్ మరియు Mozilla యూజర్లను హెచ్చరించిన భారత ప్రభుత్వం

ముందుగా, యాపిల్ కస్టమర్లకు హెచ్చరికలు జరిచిన తరువాత ఇప్పుడు భారత ప్రభుత్వం గూగుల్ క్రోమ్ మరియు Mozilla యూజర్ల కోసం కూడా హెచ్చరికలను జారీచేసింది. గూగుల్ క్రోమ్ OS మరియు మొజిల్లా ప్రోడక్ట్స్ పైన “multiple security vulnerabilities” గురించి తెలియపరుస్తూ ఈ హెచ్చరిక చేసింది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో భాగంగా పనిచేస్తున్న సంస్థ CERT-In ఈ హెచ్చరికలను జారీ చేసింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇటీవల, సఫారి బ్రౌజర్ ను లక్ష్యంగా చేసుకొని హ్యాకర్లు వ్యాప్తిచేసిన వైరస్ ద్వారా యాపిల్ పరికరాలు ప్రభావితమయ్యాయి. మాల్వేర్ ద్వారా అట్టాక్ చేసే వ్యక్తి దీని ద్వారా వినియోగదారులను “హానికరమైన రీతిలో రూపొందించిన వెబ్ కంటెంట్” వైపు మళ్లించవచ్చు. అయితే, ఇప్పుడు ఇదే దారిలో గూగుల్ క్రోమ్ మరియు Mozilla పైన కొత్త విధానంతో మాల్వేర్ గుప్పించే ప్రయత్నం జరిగినట్లు తెలిపింది.

రెండు రోజుల క్రితం విడుదల చేసిన మొజిల్లా ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌ లకు సంబంధించి CERT-In భద్రతా హెచ్చరికను జారీచేసింది. ఈ హెచ్చరికలో, మొజిల్లా ప్రోడక్ట్స్ మరియు గూగుల్ క్రోమ్ OS లో అనేక వెల్నర్ బిలిటీస్ ఉన్నట్లు నివేదించబడింది. దీని కారణంగా సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేయడానికి, భద్రతా పరిమితులను దాటవేయడానికి, ఏకపక్ష కోడ్‌ని అమలు చేయడానికి, స్పూఫింగ్ దాడులకు,  మరియు కారణం కావచ్చని తెలిపింది.

CERT అధికారికంగా విడుదలల చేసిన Mozilla మరియు Chrome OS రెండింటి యొక్క ప్రభావిత వెర్షన్‌లు ఈ క్రింద చూడవచ్చు:

Mozilla Firefox:

  • Mozilla Firefox iOS version prior to 101,
  • Mozilla Firefox Thunderbird version prior to 91.10,
  • Mozilla Firefox ESR version prior to 91.10, and
  • Mozilla Firefox version prior to 101

Google Chrome OS:

Google Chrome versions prior to 96.0.4664.209

 

అయితే, Google మరియు Mozilla రెండూ కూడా వెంటనే స్పందించి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను విడుదల చేసినందున, ఈ సమస్య నుండి యూజర్లను తప్పించాయి. కాబట్టి, Mozilla Firefox లేదా Google Chrome OS యొక్క పాత వెర్షన్‌ లను ఉపయోగిస్తున్న వినియోగదారులందరూ కొత్త అప్డేట్ ను వీలైనంత త్వరగా డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేసుకోవాలని కోరడం వల్ల ఎటువంటి నష్టం జరగకుండా నివారించవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo