గత వారం రోజులుగా బంగారం సూచీలు పై పైకే చూస్తున్నాయి. మొత్తంగా ఈ నెల గోల్డ్ మార్కెట్ ఇన్వెస్ట్ చేసిన వారికి లాభాల బాటనే నడుస్తోంది. కానీ, బంగారం కొనుగోలుదారులకు మాత్రం గొంతులో ఇరుక్కున్న పచ్చి వెళక్కాయ లాగా మారింది. వాస్తవానికి, జూన్ 30 న తులం 24 క్యారెట్ బంగారం ధర 50,890 ఉండగా, ఈరోజు మార్కెట్లో తులం బంగారం 52,470 రూపాయలు పలుకుతోంది. ఒక్కసారిగా భారీగా పెరిగి స్తబ్దుగా నిలిచినా బంగారం మార్కెట్ ఈరోజు కూడా స్వల్పంగా పెరిగింది. ఈరోజు తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశ ప్రధాన నగరాల్లో బంగారం ధర ఎలా ఉన్నదో పరిశీలిద్దాం.
నిన్న10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 48,000 రూపాయలుగా ఉండగా, ఈరోజు స్వల్పంగా పెరిగి, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 48,100 రూపాయలుకు చేరుకుంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా స్వల్పంగా పెరిగి రూ.52,470 వద్ద కొనసాగుతోంది.
ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,100 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,470 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,100 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,470 గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,100 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,470 గా ఉంది. ఈరోజు దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే లక్నో లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు లక్నో లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,250 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,570 గా ఉంది.
ప్రతి రోజు Gold Live అప్డేట్స్ కోసం Click Here