కొండెక్కిన బంగారం: ఈరోజు తులం రేటు ఎంతంటే..!!

కొండెక్కిన బంగారం: ఈరోజు తులం రేటు ఎంతంటే..!!
HIGHLIGHTS

గత నెల చివరికల్లా 50,890 రూపాయల కనిష్ఠ ధరను నమోదు చేసిన బంగారం

ఈ నెల ప్రారంభం నుండి బంగారం మార్కెట్ కొండెక్కి కూర్చుంది

1,450 రూపాయలు పెరిగిన 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్

గత నెల చివరికల్లా 50,890 రూపాయల కనిష్ఠ ధరను నమోదు చేసిన బంగారం మార్కెట్, ఈ నెల ప్రారంభం నుండి కొండెక్కి కూర్చుంది. కేవలం జూలై 1 వ తేదీ ఒక్కరోజే గ్రాముకు 130 చొప్పున 1,300 పైగా పెరిగిన తులం స్వచ్ఛమైన గోల్డ్ రేట్, 2 వ తేదీకి కూడా అదే జోరుతో తులానికి 140 రూపాయలు పెరిగింది. అంటే, మొత్తంగా రెండు రోజుల్లో 1,450 రూపాయలు పెరిగిన 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్ ఈరోజు కూడా అదే ధరతో కొనసాగుతోంది. ఈరోజు 52,340 రూపాయల వద్ద వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ ధర ఈరోజు కూడా తటస్తంగా నిలబడి  52,340 రూపాయల మార్క్ వద్ద కొనసాగుతోంది. మరి ఈరోజు తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశ ప్రధాన నగరాల్లో గోల్డ్ మార్కెట్ ఎలా ఉన్నదో ఒక లుక్ వేద్దామా.

గత వారం ప్రారంభంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,650 రూపాయలుగా ఉండగా, వారాంతానికి గ్రాముకు 135 రూపాయలు పెరిగి, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 48,000 రూపాయలుకు చేరుకుంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా గ్రాముకు 144 రూపాయలు పెరిగి రూ.52,320 వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు  హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,800 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,340 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,800 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,340 గా ఉంది. 

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,800 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,340 గా ఉంది. ఈరోజు   దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే లక్నో లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు లక్నో లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,150 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,490 గా ఉంది.

ప్రతి రోజు Gold Live అప్డేట్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo