ఈరోజు బంగారం ప్రియులకు కొంచెం ఊరట కలిగింది. ఈవారం మొదలవుతూనే సోమవారం నుండి బంగారం ధర రాకెట్ స్పీడ్ తో దూసుకు పోయింది. అయితే, ఈరోజు మార్కెట్లో బంగారం ధరకు బ్రేకులు పడ్డాయి. ఈరోజు బంగారం కేవలం నామ మాత్రపు పెరుగుదలను మాత్రమే నమోదు చేసింది. కానీ, ఈరోజు కలిపి కేవలం ఈ ఒక్క వారంలోనే 1,400 రూపాయలకు పైగా పెరుగుదలను నమోదు చేసింది. ఈరోజు మార్కెట్లో గోల్డ్ రేట్ ఎలా ఉన్నదో క్రింద చూడవచ్చు.
నిన్న ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,750 రూపాయలుగా ఉండగా, ఈరోజు 100 రూపాయలు పెరిగి 47,850 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు రూ.52,200 రూపాయల వద్ద కొనసాగుతోంది.
ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,850 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,200 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,860 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,210 గా ఉంది.
ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.52,150 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,400 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,800 గా ఉంది.