దూసుకెళుతున్న బంగారం ధర.. ఒక్క రోజులో ఎంత పెరిగిందంటే..!!

దూసుకెళుతున్న బంగారం ధర.. ఒక్క రోజులో ఎంత పెరిగిందంటే..!!
HIGHLIGHTS

5 రోజుల నుండి బంగారం సూచీలు పై పైకి చూస్తున్నాయి

ఈరోజూ కూడా బంగారం మరింత పెరిగింది

బంగారం 660 రూపాయల భారీ పెరుగుదలను నమోదు చేసింది

గత 5 రోజుల నుండి బంగారం సూచీలు పై పైకి చూస్తున్నాయి. అదే బాటలో ఈరోజూ కూడా బంగారం మరింత పెరిగింది. గత 5 రోజుల నడుస్తున్న గోల్డ్ ట్రెండ్ ను చూస్తే, 10 గ్రాముల బంగారం ధర దాదాపు 1,050 రూపాయలకు పైగా పెరిగింది. ఇక ఈరోజు మార్కెట్లో గోల్డ్ చూస్తే, ఈరోజు 10 గ్రాముల బంగారం ధర 660 రూపాయల భారీ పెరుగుదలను నమోదు చేసింది. గత వారం పెళ్లిళ్ల సీజన్ లో కూడా బంగారం ధర తగ్గు ముఖం పట్టగా, ఇప్పుడు బంగారం రేటు పెరగడం ఆశ్చర్యపరుస్తోంది. మరి ఈరోజు గోల్డ్ మార్కెట్ ఎలా ఉన్నదో చూద్దాం.

గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,150 రూపాయలుగా ఉండగా, ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,750 రూపాయలుగా ఉంది. అలాగే, నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,430 కాగా, నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,090 వద్ద కొనసాగుతోంది. అంటే, ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర 660 రూపాయలు పెరిగింది.

gold jewellery 650.jpg

ఈరోజు బంగారం ప్రారంభ ధర

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,090 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా ఉంది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,230 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,600 గా ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే,ఈరోజు  హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,090 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,090 గా ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo