మరింతగా తగ్గిన బంగారం ధర .. ఈరోజు ధర ఎంతంటే..!!
బంగారం ధర మరింతగా పడిపోయింది
10 గ్రాముల బంగారం ధర దాదాపు 1,900 రూపాయల వరకూ తగ్గింది
ఈ ఒక్క వారంలోనే దాదాపుగా 990 రూపాయల వరకూ తగ్గింది
బంగారం ధర మరింతగా పడిపోయింది మరియు గడిచిన వారం రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర దాదాపు 1,900 రూపాయల వరకూ తగ్గింది. నిన్న కూడా మార్కెట్లో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర 450 తగ్గింది. గత నెలలో 50 వేల మార్కును టచ్ చేసిన 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర నిన్న 48,000 ధర వద్ద ముగిసింది. వాస్తవానికి, ఈ ఒక్క వారంలోనే దాదాపుగా 990 రూపాయల వరకూ తగ్గి 48,000 రూపాయల వధ్ద ఈరోజు ప్రారంభమయ్యింది. మరి ఈరోజు ఈరోజు బంగారం ధర ఎంత ఎలా ఉన్నదో చూద్దాం.
Surveyగుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, 10 రోజుల క్రితం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర (18వ తేది) 49,850 రూపాయలుగా ఉండగా, ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ప్రారంభ ధర 48,000 రూపాయలుగా ఉంది. అలాగే, 10 రోజుల క్రితం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం (18వ తేది) ధర రూ.54,380 కాగా, నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ప్రారంభ ధర రూ.52,370 గా ఉంది. అంటే, 10 రోజుల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచమైన బంగారం ధర దాదాపుగా 2,000 రూపాయల వరకూ తగ్గింది.
ఈరోజు బంగారం ప్రారంభ ధర
దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,000 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,370 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా ఉంది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,840 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,280 గా ఉంది.
ఇక తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,000 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,370 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,000 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,370 గా ఉంది.