మరింత దిగజారిన బంగారం ధర .. ఈరోజు ధర ఎంతంటే..!!
10 రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర దాదాపు 2,000 రూపాయల వరకూ తగ్గింది
ఈరోజు కూడా మార్కెట్లో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర 200 రూపాయలు తగ్గింది
బంగారం కొనాలనుకునే వారికీ గుడ్ న్యూస్
ఏప్రిల్ నెల 18 వ తేదీ వరకూ భారీగా పెరిగిన ధర తగ్గుతూ వచ్చిన బంగారం ధర నెల చివరి నుండి రోజురోజుకు తగ్గుతూ వచ్చింది. ఇదే దారిలో ఈరోజు కూడా 10 గ్రాముల బంగారం ధర దాదాపుగా 200 రూపాయల వరకూ తగ్గుదలను చూసింది. ఇక గడిచిన 10 రోజుల ట్రెండ్ ను పరిశీలిస్తే కూడా బంగారం ధర తరుగుదలనే సూచిస్తోంది. గడిచిన 10 రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర దాదాపు 2,000 రూపాయల వరకూ తగ్గింది. నిన్నటి పోలిస్తే ఈరోజు కూడా మార్కెట్లో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర 200 రూపాయలు తగ్గింది. ఇక గత నెల హైఎస్ట్ రేటుతో పోలిస్తే 2,850 రూపాయల వరకూ బంగారం రేట్ తగ్గింది. మరి ఈరోజు ఈరోజు బంగారం ధర ఎంత ఎలా ఉన్నదో చూద్దాం.
Surveyగుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, 10 రోజుల క్రితం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 48,990 రూపాయలుగా ఉండగా, ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ప్రారంభ ధర 47,000 రూపాయలుగా ఉంది. అలాగే, గత వారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,440 కాగా, నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ప్రారంభ ధర రూ.51,280 గా ఉంది. అంటే, ఈ 10 రోజుల్లోనే 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచమైన బంగారం ధర దాదాపుగా 2,160 రూపాయల వరకూ తగ్గింది. ఇక, ఈరోజు గోల్డ్ మార్కెట్ ను పరిశీలిస్తే, 47,200 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర మార్కెట్ ప్రస్తుతం 200 రుపాయలు తగ్గి, 47,000 వద్ద కొనసాగుతోంది. అంటే, ఈరోజు కూడా బంగారం సూచీలు నెల చూపులు చూస్తున్నాయి.
ఈరోజు బంగారం ప్రారంభ ధర
దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,000 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,280 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా ఉంది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,100 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,320 గా ఉంది.
ఇక తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,000 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,280 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,000 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,280 గా ఉంది.