ఈరోజు స్వల్పంగా పెరిగిన బంగారం.. తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్ తెలుసుకోండి..!

ఈరోజు స్వల్పంగా పెరిగిన బంగారం.. తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్ తెలుసుకోండి..!
HIGHLIGHTS

ఈరోజు మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది

అయినా కూడా 7 నెలల కనిష్ఠం లోనే బంగారం ధర కొనసాగుతోంది

బంగారం ధర ఈరోజు కూడా కొంత ఆశాజనకంగానే కనిపిస్తోంది

ఈరోజు మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. అయినా కూడా 7 నెలల కనిష్ఠం లోనే బంగారం ధర కొనసాగుతోంది. అంటే, బంగారం ధర ఈరోజు కూడా కొంత ఆశాజనకంగానే కనిపిస్తోంది. అయితే, గత మూడు రోజులుగా స్థిరంగా కొనసాగిన బంగారం ధర ఈరోజు స్వల్పంగా పెరుగుదలను నమోదు చేసింది. అందుకే,  ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర మార్కెట్ లో కొనసాగుతోందో తెలుసుకుందాం.

నిన్న మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 45,800 రూపాయలుగా ఉండగా, ఈరోజు 600 రూపాయలు తగ్గి 46,400 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు రూ.40,620 రూపాయల వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు  హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,400 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,620 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,410 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,630 గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,400 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,620 గా ఉంది. ఈరోజు కూడా    దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,800 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,050 గా ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo