వార్ మొదలవగానే అమాంతంగా పెరిగిన బంగారం ధర రోజురోజుకు తగ్గుముఖం పట్టింది. బంగారంతో పాటుగా వెండి ధర సూచీలు కూడా పైకి ఎగబాకడం మనం చూశాము. అయితే, ఇప్పుడు ఈ ధరలు క్రిందకి దిగడం మనం చూడవచ్చు. గతవారం, బంగారం ధర 10 గ్రాములకు దాదాపు రూ.1,133 తరుగుదలను నమోదు చెయ్యగా వెండి అదే దారిలో ధర తగ్గింది. ఈ రోజు బులియన్ మార్కెట్‌లో బంగారం మరియు వెండి ధర ఎంత అనే దాని గురించి మీరు పూర్తి సమాచారాన్ని పొందవచ్చు.
ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) ద్వారా అదించబడిన సమాచారం ప్రకారం, మార్చి 11న భారతీయ మార్కెట్లో బంగారం ధర రూ. 52,462 అని సమాచారం. అయితే, ఈ ధర మార్చి 7న చూస్తే, అప్పుడు ఇది దాదాపు రూ. 53,595 అంటే వారం మధ్యలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఇదొక్కటే కాదు, వెండి ధర కూడా క్షీణించినట్లు సమాచారం. అంటే మార్చి 7న కిలో రూ.70,580 లెక్కన చూస్తే మార్చి 11 నాటికి రూ.69,713కి తగ్గింది.
ఇక ఈరోజు లైవ్ గోల్డ్ రేట్ చూస్తే బంగారం రూ. 52,470 రూపాయలు వుంది. అంటే, ఈరోజు కూడా బంగారం ధర దిగువ సూచీనే చూపిస్తోంది. అంటే, బంగారం ధర ఈరోజు కూడా దాదాపుగా 320 రూపాయల వరకు తగ్గింది.