ఈరోజు కూడా మార్కెట్లో బంగారం ధర నిశ్చలంగా వుంది మరియు పసిడి కొనాలని చూసే వారికి ఆశాజనకంగా వుంది. ఈ నెల మొత్తం కూడా బంగారం ధర దాదాపుగా 50 వేల రూపాయల చుట్టూనే తిరుగుతూ వుంది. అంతేకాదు, గోల్డ్ మార్కెట్ ఈ నెల ఎక్కువగా డౌన్ ట్రెండ్ ఫాలో అయ్యింది. అయితే, గత మూడు రోజులుగా గోల్డ్ మార్కెట్ స్థిరంగా కొనసాగుతోంది. ఇక ఈ నెల, సెప్టెంబర్ 15న బంగారం ధర 18 నెలల కనిష్ఠాన్ని కూడా నమోదు చేసింది. మరి ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ ధర మార్కెట్ లో ఎలా ఉన్నదో తెలుసుకుందామా.
గత వారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,500 రూపాయలుగా ఉండగా, వారం మొత్తం మీద 700 రూపాయలు తగ్గి 45,800 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు రూ.49,970 వద్ద కొనసాగుతోంది.
ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,800 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,970 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,810 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,980 గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,800 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,970 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,250 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,450 గా ఉంది.