సార్వత్రిక ఎన్నికలు 2019 : మీ ఓటు గురించిన అన్ని వివరాలు తీసుకొండిలా
ఇక్కడ మీరు మీ వివరాలతో పాటుగా ఓటరు ID లో ఏవైనా తప్పులు ఉంటే సరిచేసుకోవడానికి కావాల్సిన "Form 8" మరియు అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీ మార్చుకోవడానికి అవసరమైన "Form 6" మరియు మరికొన్ని ఫారమ్లను కూడా అందుకుంటారు.
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు 2019 కోసమా మనం సిద్ధంగా ఉండాలి. ఎందకంటే, మన భవిష్యత్తును నిర్ణయించేది మరెవరోకాదు, మనమే. మనం వేసే ఒక్క ఓటుతో మనం మనకు కావల్సిన వారిని ఎంచుకోవచ్చు . అయితే ఓటువేయాలంటే, మన ఓటు ఉనికిలో ఉండాలి. దీని గురించి మన్మ తెలుసుకోవడానికి ఎవరెవరి దగ్గరికో పోయి వారివద్దనున్న ఓటరు లిస్ట్ నుండి మనం పేరును తనిఖీ చెసుకుంటూవుంటాం. కానీ ఆ అవసరం ఎమాత్రం లేకుండా కేవలం మీ మొబైల్ నుండి లేదా కంప్యూటర్ నుండి మీరు మీ ఓటు వివరాలను తెసులుకోవచ్చు. అందుకోసం మీరు చేయాల్సిందల్లా, ఎలక్షన్ కమిషన్ ఓటర్ల ఓటును తనిఖీ చేసుకోవడనికి అందించి వెబ్ సైట్ లోకి వెళ్లి అక్కడ సూచించిన కొన్ని వివరాలను అందిస్తే సరిపోతుంది. మీకు దీనిగురించి పూర్తి సమాచారాన్ని ఇక్కడ అందిస్తున్నాను.
Surveyఇక్కడ మీరు మీ వివరాలతో పాటుగా ఓటరు ID లో ఏవైనా తప్పులు ఉంటే సరిచేసుకోవడానికి కావాల్సిన "Form 8" మరియు అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీ మార్చుకోవడానికి అవసరమైన "Form 6" మరియు మరికొన్ని ఫారమ్లను కూడా అందుకుంటారు.
మీ ఓటు యొక్క స్టేటస్ తెలుసుకోవడం ఎలా?
ఈ క్రింది విధంగా చేయండి.
1. https://electoralsearch.in వెబ్ సైట్ యొక్క పోర్టల్ లోకి ప్రవేశించాలి.
2. ఇక్కడ సూచించిన దగ్గర మీ పేరును ఎంటర్ చేయాలి
3. దాని క్రింద మీ వయసు లేదా పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయాలి
4. పురును ఎంటర్ చేసిన ప్రక్క బాక్సులో మీ తండ్రి పేరు రాయండి
5. దాని క్రింద మీ జెండర్ (స్త్రీ/పురుషులు) ఎంచుకోండి
6. ఇక రెండవ ప్రధాన బాక్సులో, State అని సూచించిన దగ్గర మీ రాష్ట్రాన్ని ఇచ్చిన లిస్టు నుండి ఎంచుకోండి
7. దాని క్రింద బాక్సులో District అని సూచించిన దగ్గర మీ జిల్లాని ఇచ్చిన లిస్టు నుండి ఎంచుకోండి
8. ఇక చివరిగా మీ అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీ ని ఇచ్చిన లిస్టు నుండి ఎంచుకోండి
9. అన్నింటికంటే క్రింద ఇచ్చిన "CODE" బాక్సులో అక్కడ అందించిన ఇంగ్లీష్ లెటర్స్ న్టర్ చేసి సెర్చ్ బటన్ పైన నొక్కండి
10. ఇక్కడ సెర్చ్ క్రింద మీ ఓటు వివరాలు వస్తాయి. ఇక్కడ "View Details" పైన నొక్కడంతో పూర్తి వివరాలను చూడవచ్చు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile