Free Laptop Scam పేరుతో స్టూడెంట్స్ కి వల వేస్తున్న స్కామర్లు.. జర భద్రం.!
Free Laptop Scam పేరుతో స్కామర్లు కొత్త స్కామ్ కు తెరలేపారు
ఈ కొత్త స్కామ్ తో జాగ్రత్త అని PIB Fact Check హితవు పలికింది
ఈసారి స్కామర్లు అచ్చంగా స్టూడెంట్స్ ని టార్గెట్ చేసుకొని ఈ కొత్త స్కామ్ కి తెరలేపారు
Free Laptop Scam పేరుతో స్కామర్లు కొత్త స్కామ్ కు తెరలేపారు. ఈ కొత్త స్కామ్ తో జాగ్రత్త అని PIB Fact Check హితవు పలికింది. దేశంలో ఇప్పటికే లెక్కలేనన్ని స్కామ్ లు బయటపడగా, ఇప్పుడు మరొక కొత్త స్కామ్ కూడా బయటపడింది. అయితే, ఈసారి స్కామర్లు అచ్చంగా స్టూడెంట్స్ ని టార్గెట్ చేసుకొని ఈ కొత్త స్కామ్ కి తెరలేపారు. మీరు కూడా స్టూడెంట్ అయితే ఈ కొత్త స్కాం గురించి పూర్తిగా తెలుసుకోవడం మంచిది.
Surveyఏమిటి ఈ Free Laptop Scam?
స్టూడెంట్ కోసం ఉచిత ల్యాప్ టాప్స్ అందజేస్తామని ఒక వెబ్సైట్ నమ్మబలుకుతోంది. ఈ విధంగా తెలియజేసే ఒక మెసేజ్ వాట్సాప్ లో విపరీతంగా సర్కులేట్ అవుతుంది. దీనిపై క్లిక్ చేసి వెబ్సైట్ చేరుకున్న తర్వాత అక్కడ విద్యార్థి యొక్క పూర్తి వివరాలు అందించవలసి ఉంటుంది కాబట్టి ఇక్కడ అందించిన లింక్ పై క్లిక్ చేసి ఉచిత ల్యాప్ టాప్ కోసం అప్లై చేసుకోవచ్చు, అని ఈ మెసేజ్ చెబుతుంది.

ఉచితంగా ల్యాప్ టాప్ పొందవచ్చనే కంగారులో లింక్ పైన క్లిక్ చేశారా ఇక అంతే సంగతులు. ఎందుకంటే, అది యూజర్ డివైజ్ ను హ్యాక్ చేయడానికి స్కామర్లు సెట్ చేసిన లింక్. ఒక్కసారి ఈ లింక్ పై క్లిక్ చేశారంటే మీ డివైజ్ యొక్క పూర్తి యాక్సెస్ స్కామర్ వెళ్ళిపోతుంది. ఇంకేముంది, మీ సున్నితమైన పర్సనల్ డేటా తో పాటు మీ అకౌంట్ లో ఉన్న డబ్బంతా దండుకుంటారు.
Did you also receive a #WhatsApp message offering free laptops ⁉️
— PIB Fact Check (@PIBFactCheck) December 15, 2024
Beware⚠️ This is a scam to dupe you ‼️#PIBFactCheck
🔹Never click on such suspicious links
🔹Be cautious while sharing personal information. pic.twitter.com/sid1FnutEy
ఈ విధంగా సర్క్యులేట్ అవుతున్న ఉచిత ల్యాప్ టాప్ ప్రోగ్రాం అనేది పూర్తిగా మోసపూరితమైనది, అని PIB Fact Check తన x అకౌంట్ నుంచి ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ద్వారా ఇటివంటి మోసపూరిత సైట్స్ లేదా మెసేజ్ లను నమ్మి మోసపోకండి అని కూడా చెబుతోంది. ఒకవేళ మీకు ఇటివంటి ఏదైనా మెసేజ్ వచ్చినట్లయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ లింక్ పై క్లిక్ చేయవద్దని కూడా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) హెచ్చరించింది.
Also Read: Samsung Dolby Atmos సౌండ్ బార్ పై డిస్కౌంట్ ఆఫర్ అందుకోండి.!