Flipkart Big Shopping Utsav సేల్ రేపటి నుంచి భారీ ఆఫర్లతో ప్రారంభం అవుతోంది.!

HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ మరొక కొత్త సేల్ Flipkart Big Shopping Utsav సేల్ ప్రకటించింది

ఈ ఫ్లిప్ కార్ట్ సేల్ రేపటి నుంచి ప్రారంభం అవుతుంది

ఆఫ్ లైన్ స్టోర్స్ తో పాటు ఆన్లైన్ స్టోర్స్ లో కూడా గొప్ప డిస్కౌంట్ ఆఫర్లు గుప్పిస్తున్నారు

Flipkart Big Shopping Utsav సేల్ రేపటి నుంచి భారీ ఆఫర్లతో ప్రారంభం అవుతోంది.!

దసరా పండుగ మరియు దీపావళి పండుగ సీజన్ సేల్స్ హోరాహోరిగా కొనసాగుతున్నాయి. ఆఫ్ లైన్ స్టోర్స్ తో పాటు ఆన్లైన్ స్టోర్స్ లో కూడా గొప్ప డిస్కౌంట్ ఆఫర్లు ఈ సీజన్ కోసం గుప్పిస్తున్నారు. రీసెంట్ గా ఫ్లిప్ కార్ట్ అందించిన ఫ్లిప్ కార్ట్ ది బిగ్ బిలియన్ డే సేల్ గొప్ప డీల్స్ అందించింది. ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ మరొక కొత్త సేల్ Flipkart Big Shopping Utsav సేల్ ప్రకటించింది. ఈ సేల్ రేపటి నుంచి ప్రారంభం అవుతుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Flipkart Big Shopping Utsav

ఫ్లిప్ కార్ట్ యొక్క ఈ అప్ కమింగ్ సేల్ అక్టోబర్ 9వ తేదీ నుంచి మొదలవుతుంది. ఈ సేల్ ను నాలుగు బ్యాంక్ ల భాగస్వామ్యంతో తీసుకు వస్తోంది. అవేమిటంటే, Axis బ్యాంక్, BOB బ్యాంక్, RBL బ్యాంక్ మరియు YES బ్యాంక్. అందుకే, ఈ నాలుగు బ్యాంక్ కార్డ్స్ తో ఈ సేల్ నుంచి వస్తువులను కొనుగోలు చేసే వారికి 10% అదనపు డిస్కౌంట్ అందిస్తుంది.

Also Read: OnePlus దివాళి ఆఫర్: వన్ ప్లస్ 12 ఫోన్ కొంటే 14 వేల విలువైన బడ్స్ ఉచితం.!

Flipkart Big Shopping Utsav : డీల్స్

ఇక ఈ అప్ కమింగ్ సేల్ డీల్స్ విషయానికి వస్తే, రేపటి నుంచి మొదలవుతున్న ఈ సేల్ నుంచి గొప్ప ఆఫర్స్ అందిస్తుందని ఫ్లిప్ కార్ట్ టీజింగ్ చేస్తోంది. టీజింగ్ విషయం పక్కన పెడితే, ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ నుంచి అందించిన బెస్ట్ డీల్స్ ను మళ్ళీ తిరిగి అందించే అవకాశం ఉండవచు. గత సేల్ నుంచి స్మార్ట్ టీవీ, స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్, ఎయిర్ బడ్స్ మరియు సౌండ్ బార్స్ వంటి చాలా ప్రొడక్ట్స్ పై ఫ్లిప్ కార్ట్ భారీ డీల్స్ అందించింది.

ఇప్పుడు కూడా రేపటి నుంచి మొదలువుతున్న ఫ్లిప్ కార్ట్ బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ నుంచి స్మార్ట్ టీవీ, స్మార్ట్ ఫోన్ మరియు సౌండ్ బార్స్ పై గొప్ప డీల్స్ అందిస్తుందని ఆశిస్తున్నారు. ఇది మాత్రమే కాదు, లేటెస్ట్ గా ఇండియాలో విడుదలైన స్మార్ట్ ఫోన్ లను సైతం గొప్ప డీల్స్ తో సేల్ చేసే అవకాశం ఉందని ఆశిస్తున్నారు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile