ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ డేట్ మరియు ఆఫర్ల గురించి ప్రకటించింది. ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్ మే 3 వ తేదీ నుండి 8 వ తేది వరకు మొత్తంగా 5 రోజులు అందుబాటులో ఉంటుందని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. అంతేకాదు,Flipakrt Big Saving Days నుండి వినియోగదారులు బెస్ట్ డీల్స్ మరియు ఆఫర్లను ఆశించవచ్చని కూడా తెలిపింది. అంతేకాదు, కర్టెన్ రైజర్ డీల్స్ ద్వారా చాలా ప్రోడక్ట్స్ పైన సేల్ కంటే ముందుగానే సేల్ ఆఫర్ ధరలను అందిస్తున్నట్లు కూడా టీజింగ్ చేస్తోంది. ఇందులో, స్మార్ట్ టీవీలు మొదలుకొని AC లు, హెడ్ ఫోన్స్ మరియు మరిన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇందులో మొత్తంగా 47 ఐటమ్స్ ను అఫర్ చేస్తోంది.
Survey
✅ Thank you for completing the survey!
ఈ సేల్ నుండి ఎలక్ట్రానిక్స్ పైన 80% వరకూ మరియు టీవీల పైన 75% వరకూ భారీ డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు టీజింగ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ సేల్ గురించి టీజింగ్ చేస్తున్న ద్వారా మరిన్ని వివరాలను చూడవచ్చు. ఈ ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ను ఈసారి SBI బ్యాంక్ భాగస్వామ్యంతో నిర్వహిస్తోంది. అందుకే, SBI క్రెడిట్ కార్డ్స్ తో వస్తువులను కొనుగోలుచేసే కొనుగులుదారులకు సేల్ డిస్కౌంట్ తో పాటుగా 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ సేల్ నుండి నుండి స్మార్ట్ వాచ్ లను గరిష్టంగా 60% డిస్కౌంట్ తో, ల్యాప్ టాప్ ల పైన కూడా గరిష్టంగా 40% వరకూ డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తెలిపించింది. Check offers Here
ఇక కొనుగోలుదారులు ఎక్కువగా లాభాలను అందుకునే ఆఫర్ల గురించి చూస్తే, స్మార్ట్ ఫోన్స్, అప్లయన్సెస్ మరియు ఫ్యాషన్స్ పైన మంచి డిస్కౌంట్ అఫర్ చేయనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ చెబుతోంది. ఈ డీల్స్ కాకుండా క్రేజీ డీల్స్, రష్ అవర్స్, tick tock డీల్స్ మరియు మరిన్ని ఆఫర్లను కూడా అందించనున్నట్లు వెల్లడించింది.