Flipkart Big Saving Days Sale బెస్ట్ డీల్స్ అండ్ ఆఫర్స్ తో మళ్ళి వస్తోంది. ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్ జూలై 25 తేదీ నుండి జూలై 29 వరకూ జరుగుతుంది. ఈ సేల్ కోసం ICICI బ్యాంక్ భాగస్వామిగా కలిసింది. ICICI బ్యాంక్ వినియోగదారులకు 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. 'జబర్దస్త్ ఆఫర్స్ సబ్ కేలియే' క్యాప్షన్ తో వస్తున్న ఈ సేల్ నుండి మంచి డిస్కౌంట్ మరియు డీల్స్ అందించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ టీజింగ్ మొదలుపెట్టింది.
Survey
✅ Thank you for completing the survey!
ఇక కొనుగోలు దారులు ఎక్కువగా పరిశీలించే ఆఫర్ల గురించి చూస్తే, స్మార్ట్ ఫోన్, LED టీవీలు మరియు అప్లయన్సెస్ పైన మంచి డిస్కౌంట్ అఫర్ చేయబోతున్నట్లు ఫ్లిప్‌కార్ట్ చెబుతోంది. ముఖ్యంగా, ఎలక్ట్రానిక్స్ మరియు యాక్సెసరీస్ పైన గరిష్టంగా 80% వరకూ డిస్కౌంట్ అఫర్ చేనునట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేకమైన మైక్రోసైట్ పేజ్ ద్వారా ప్రకటించింది.
ఇది మాత్రమే కాదు, ఫ్యాషన్ మరియు బ్యూటీ విభాగాల్లో కూడా మరిన్ని లాభాలను కస్టమర్లు ఆస్వాదించవచ్చని టీజ్ చేస్తోంది. బ్రాండెడ్ షూస్, టీషర్ట్స్ మరియు లేడీస్ బ్యూటీ ప్రోడక్ట్స్ పైన అధిక 50-80% డిస్కౌంట్ అఫర్ చేయనుంది. ఈ సేల్ నుండి రిఫ్రిజిరేటర్లు కేవలం రూ. 6,490 రూపాయల నుండి ప్రాంభమవుతాయి. ఈ సేల్ నుండి సౌండ్ బార్స్ మరియు టీవీల పైన మరిన్ని డీల్స్ అందుకోవచ్చు.