ఈ దీపావళి కోసం భారీ ఆఫర్లతో Big Diwali Sale ప్రకటించిన Flipkart

HIGHLIGHTS

Flipkart ఈ దీపావళి కోసం భారీ ఆఫర్లతో Big Diwali Sale ని ప్రకటించింది

బిగ్ దివాళీ సేల్ అక్టోబర్ 11 నుండి అక్టోబర్ 16 వ తేది వరకూ అందుబాటులో ఉంటుంది

ఈ సేల్ నుండి గొప్ప ఆఫర్లను పొందవచ్చని ఫ్లిప్ కార్ట్ పేర్కొంది

దసరా పండుగ సందర్భంగా రెండు సేల్స్ ను నిర్వహించిన Flipkart, ఈ దీపావళి కోసం భారీ ఆఫర్లతో Big Diwali Sale ని ప్రకటించింది. ఈ బిగ్ దివాళీ సేల్ అక్టోబర్ 11 నుండి అక్టోబర్ 16 వ తేది వరకూ అందుబాటులో ఉంటుంది మరియు ఈ సేల్ నుండి గొప్ప ఆఫర్లను కూడా పొందవచ్చని ఫ్లిప్ కార్ట్ పేర్కొంది. ఈ సేల్ నుండి ఇప్పటికే అందించిన మైక్రో సైట్ పేజ్ ద్వారా అప్ కమింగ్ సేల్ నుండి అందిచనున్న చాలా ఆఫర్ల వివరాల గురించి కూడా టీజింగ్ మొదలుపెట్టింది. మరి రానున్న దీపావళి పండుగ కోసం ఫ్లిప్ కార్ట్ తీసుకువస్తున్న Big Diwali Sale నుండి ఏటివంటి ఆఫర్లను కస్టమర్లు ఎటువంటి ఆఫర్లను ఆశించ వచ్చునో తెలుసుకోండి.

ముందుగా, ఈ సేల్ నుండి అందనున్న బ్యాంక్ ఆఫర్ల విషయానికి వస్తే, Flipkart ఈ సేల్ ను Kotak మరియు SBI బ్యాంక్ భాగస్వామ్యంతో నిర్వహిస్తోంది కాబట్టి, ఈ రెండు బ్యాంక్ కార్డ్స్ ద్వారా షాపింగ్ చేసే వారికి 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. కాబట్టి, Kotak మరియు SBI బ్యాంక్ కార్డ్స్ కలిగిం వారికి ఈ సేల్ నుండి అదనపు డిస్కౌంట్ అఫర్ అందుతుంది.     

ఇక ఈ ఫ్లిప్ కార్ట్ అప్ కమింగ్ సేల్ బిగ్ దివాళీ సేల్ నుండి ఏ ప్రోడక్ట్స్ పైన ఎంత వరకూ డిస్కౌంట్ అఫర్ చేయబోతోందో చూస్తే, ఫ్లిప్ కార్ట్ మైక్రో సైట్ పేజ్ ద్వారా టీజింగ్ చేస్తున్న ప్రకారం, ఎలక్ట్రానిక్స్ పైన గరిష్టంగా 80% వరకూ డిస్కౌంట్ ను అఫర్ చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే, TV లు మరియు గృహోపకరణాల (హోమ్ అప్లయన్సెస్) పైన కూడా గరిష్టంగా 75% వరకు డిస్కౌంట్ అఫర్ ను పొందవచ్చని ఫ్లిప్ కార్ట్ టీజ్ చేస్తోంది. మొబైల్ ఫోన్ల పైన కూడా గొప్ప ఆఫర్లను మరియు డీల్స్ ను కూడా ప్రకటించనున్నట్లు ఫ్లిప్ కార్ట్ చెబుతోంది. అంటే, ఈ సేల్ నుండి ఈ దీపావళి పండుగకు లేటెస్ట్ మొబైల్ లను మంచి డిస్కౌంట్ ధరకే పొందే వీలుంటుందని ఫ్లిప్ కార్ట్ టీజింగ్ చెప్పకనే చెబుతోంది.

ఇక ఈ సేల్ నుండి Flipkart Originals పైన కూడా మీరు 80% డిస్కౌంట్ ఆఫర్లను చూడవచ్చని ఫ్లిప్ కార్ట్ ఊరిస్తోంది. అలాగే, క్రేజీ డీల్స్ మరియు రష్ అవర్ వంటి స్పెషల్ ఆఫర్లు కూడా ఉంటాయి. ఈ సేల్ నుండి Kotak మరియు SBI రెండు బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు EMI ద్వారా వస్తువులను కొనే వారు అధనపు తక్షణ డిస్కౌంట్ అందుకోవచ్చు. అదేవిధంగా, ఫ్లిప్ కార్ట్ పే లేటర్, ఇన్స్టాంట్ క్రెడిట్ మరియు సులభమైన EMI అప్షన్ ను కూడా అఫర్ చేస్తోంది . 

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :