Flipkart The BIg Billion Days Sale డేట్ మరియు ఆఫర్లు అనౌన్స్ చేసిన ఫ్లిప్ కార్ట్.!
Flipkart The Big Billion Days Sale డేట్ ను ఎట్టకేలకు అనౌన్స్ చేసింది
దసరా మరియు దీపావళి పండుగల కోసం ఫ్లిప్ కార్ట్ తీసుకు వస్తున్న అతిపెద్ద సేల్
ఫ్లిప్ కార్ట్ ప్లస్ యూజర్లకు ఒక రోజు ముందుగానే ఈ సేల్ యాక్సెస్ అందుతుంది
గత వారం రోజులుగా ఫ్లిప్ కార్ట్ ఊరిస్తూ వస్తున్న Flipkart The Big Billion Days Sale డేట్ ను ఎట్టకేలకు అనౌన్స్ చేసింది. అంతేకాదు, ఈ సేల్ డేట్ తో పాటుగా ఈ సేల్ నుంచి అందించనున్న కొన్ని ప్రత్యేకమైన ఆఫర్స్ ను కూడా అనౌన్స్ చేసింది. రానున్న దసరా మరియు దీపావళి పండుగల కోసం ఫ్లిప్ కార్ట్ తీసుకు వస్తున్న ఈ అతిపెద్ద సేల్ డీల్స్ మరియు సేల్ డేట్ ను తెలుసుకుందామా.
SurveyFlipkart The BIg Billion Days Sale ఎప్పుడు మొదలువుతుంది?
ఫ్లిప్ కార్ట్ ది బిగ్ బిలియన్ డేస్ సేల్ సెప్టెంబర్ 27 వ తేదీ నుంచి మొదలవుతుంది. అయితే, ఫ్లిప్ కార్ట్ ప్లస్ యూజర్లకు ఒక రోజు ముందుగానే ఈ సేల్ యాక్సెస్ అందుతుంది. అంటే, సెప్టెంబర్ 26 వ తేదీ నుంచి ఈ సేల్ యాక్సెస్ ఫ్లిప్ కార్ట్ ప్లస్ యూజర్లు పొందుతారు.
Flipkart The BIg Billion Days Sale టీజింగ్ డీల్స్ ఏమిటి?
ఈ అతిపెద్ద సేల్ ను HDFC బ్యాంక్ భాగస్వామ్యంతో తీసుకు వస్తోంది. అందుకే, HDFC బ్యాంక్ కార్డ్స్ మరియు EMI ఆప్షన్ ఈ సేల్ నుంచి ప్రోడక్ట్స్ ను కొనుగోలు చేసే కొనుగోలుదారులకు 10% అదనపు డిస్కౌంట్ ను అందిస్తుంది.

ఫ్లిప్ కార్ట్ ది బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి ఆఫర్ చేయనున్న కొన్ని డీల్స్ తో ఫ్లిప్ కార్ట్ టీజింగ్ మొదలు పెట్టింది. వాస్తవానికి, గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా స్మార్ట్ టీవీ, స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్, సౌండ్ బార్స్ మరియు మరిన్ని ప్రొడక్ట్స్ పై భారీ డీల్స్ అందించే అవకాశం వుంది.
Also Read: Amazon Great indian Festival సేల్ నుంచి iPhone 13 ఊహించనంత తక్కువ ధరకు లభిస్తుందట.!
అంతేకాదు, కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ మరియు కొత్తగా విడుదలైన స్మార్ట్ ఫోన్ ల పై అదనపు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ప్రకటించే ప్రకటిస్తుందని అంచనా వేస్తున్నారు. సేల్ డేట్ జస్ట్ ఇప్పుడే కదా అనౌన్స్ చేసింది, త్వరలోనే ఈ సేల్ ఆఫర్లు కూడా చేస్తుంది. ఈ అప్ కమింగ్ సేల్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile