Amazon Great Indian Festival Sale అనౌన్స్ చేసిన అమెజాన్.. ఆఫర్లు ఎలా ఉన్నాయంటే.!
Amazon Great Indian Festival Sale ను అమెజాన్ అనౌన్స్ చేసింది
అమెజాన్ ఈ సేల్ నుంచి గొప్ప ఆఫర్లను మరియు డీల్స్ ను కూడా తీసుకు వస్తోంది
ఈ సేల్ నుంచి అందించనున్న ఆఫర్ లను కూడా అమెజాన్ టీజింగ్ చేస్తోంది
Amazon Great Indian Festival Sale ను అమెజాన్ అనౌన్స్ చేసింది. అమెజాన్ ఈ సేల్ నుంచి గొప్ప ఆఫర్లను మరియు డీల్స్ ను కూడా తీసుకు వస్తోంది. ఈ సేల్ నుంచి అందించనున్న ఆఫర్ లను కూడా అమెజాన్ టీజింగ్ చేస్తోంది. అమెజాన్ తీసుకువస్తున్న ఈ అప్ కమింగ్ సేల్ విశేషాలు ఏమిటో తెలుసుకోండి.
SurveyAmazon Great Indian Festival Sale
అమెజాన్ ఇండియా ప్రకటించిన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మొదలయ్యే డేట్ ను ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ సేల్ గురించి ‘Coming Soon’ ట్యాగ్ తో మైక్రో సైట్ పేజ్ ను అందించింది. అంతేకాదు, ఈ సేల్ యొక్క డీల్స్ మరియు ఆఫర్స్ తో టీజింగ్ కూడా స్టార్ట్ చేసింది.
అమెజాన్ ఈ అప్ కమింగ్ సేల్ ను SBI బ్యాంక్ కార్డ్స్ భాగస్వామ్యంతో తీసుకు వస్తోంది. అందుకే, ఈ సేల్ నుంచి SBI బ్యాంక్ కార్డ్స్ తో వస్తువులు కొనుగోలు చేసే వారికి 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఎప్పటిలాగానే Prime Members కి ఈ సేల్ యాక్సెస్ ఒక రోజు ముందే అందుతుంది.

ఇక ఈ అమెజాన్ ఈ అప్ కమింగ్ సేల్ నుంచి అందించనున్న ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ సేల్ నుంచి హోమ్ అప్లయెన్సెస్ పై 75% వరకు డిస్కౌంట్ అందుకే అవకాశం వుంది. అంతేకాదు, ఈ సేల్ నుంచి బుక్స్, టాయ్స్, గేమింగ్ పైన 75% వరకు డిస్కౌంట్ అందుకోవచ్చు.
Also Read: vivo T3 Ultra ఫోన్ 30 వేల బడ్జెట్ లో సూపర్ ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!
ఇక మెయిన్ ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ సేల్ నుంచి స్మార్ట్ టీవీల పై గరిష్టంగా 65% వరకూ డిస్కౌంట్ అందుకోవచ్చని అమెజాన్ చెబుతోంది. ఇదేకాదు ఈ సేల్ నుంచి గరిష్టంగా 40% వరకు డిస్కౌంట్ అందుకోవచ్చని కూడా తెలిపింది. అంతేకాదు, అలెక్సా ప్రొడక్ట్స్ మరియు ఫైర్ టీవీ ప్రొడక్ట్స్ పై 55% వరకు సిక్సోవుంట్ అందుకోవచ్చని కూడా అమెజాన్ తెలిపింది.
అమెజాన్ టీజర్ పేజ్ నుంచి అప్ కమింగ్ సేల్ కోసం అందించనున్న ఇతర ఆఫర్స్ ను కూడా టీజింగ్ చేస్తోంది. ఇందులో ఫ్యాషన్ మరియు బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile