Flipkart నుండి మరొక సేల్: ఆఫర్లు ఎలా ఉన్నాయంటే..!

HIGHLIGHTS

Flipkart నుండి మరొక సేల్ వస్తోంది

Big Diwali Sale తరువాత వస్తున్న మరొక మొదటి సేల్

ఈ సేల్ ను Paytm భాగస్వాయ్యంతో తీసుకొచ్చింది

Flipkart నుండి మరొక సేల్: ఆఫర్లు ఎలా ఉన్నాయంటే..!

అతిపెద్ద ఇ-కామర్స్ దిగ్గజం Flipkart నుండి మరొక సేల్ వస్తోంది. దీపావళి సందర్భంగా ప్రకటించిన అతిపెద్ద సేల్ Big Diwali Sale తరువాత వస్తున్న మరొక మొదటి సేల్ ఇది. Big Bachat Dhamaal పేరుతో ఈ అప్ కమింగ్ సేల్ ను ప్రకటించింది మరియు దీని గురించి టీజింగ్ కూడా మోదలుపెట్టింది. ఈ బిగ్ బచాత్ ధమాల్ సేల్ నవంబర్ 19 నుండి నవంబర్ 21 వ తేదీ వరకూ నిర్వహంచనుంది. ఈ సేల్ ను Paytm భాగస్వాయ్యంతో తీసుకొచ్చింది. అందుకే, Paytm ద్వారా చేసే UPI మరియు Wallet చెల్లింపుల పైన రూ.50 తక్షణ క్యాష్ బ్యాక్ ను  కూడా అఫర్ చేస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ అప్ కమింగ్ సేల్ నుండి సెలెక్ట్డ్ ఎలక్ట్రానిక్స్ మరియు యాక్సెసరీస్ పైన గరిష్టంగా 80% వరకూ డిస్కౌంట్ ను అఫర్ చేస్తున్నట్లు Flipkart ప్రకటించింది. వీటిలో, ఫిట్ నెస్ బ్యాండ్స్, ఇయర్ ఫోన్స్, డెస్క్ టాప్, ట్రిమ్మర్లు, ఫోన్ కవర్లు, ఛార్జర్ మరియు మరిన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ అమేజింగ్ డీల్స్ కాకుండా ప్రతీ గంటకి మొదటిగా షాపింగ్ చేసే మొదటి 50 మంది కస్టమర్లకు వెండి నాణేలను బహుమతిగా ఇవ్వనున్నట్లు భారీ అఫర్ ను కూడా ఈ సేల్ నుండి ప్రకటించింది.

ఇక మరిన్ని డీల్స్ విషయానికి వస్తే, ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుండి 8 గంటల వరకు ధమాల్ డీల్స్ అఫర్ ద్వారా కొత్త ప్రోడక్ట్ డీల్స్ ను అందిస్తుంది. అలాగే, Loot Bazaar మరియు Combo Deals వంటి మరిన్ని డీల్స్ ను కూడా ఈ సేల్ నుండి అందిస్తోంది. ముఖ్యంగా, ఈ సేల్ నుండి ఫ్యాషన్ మరియు బ్యూటీ ప్రోడక్ట్స్ ను చాలా చవక ధరకే పొందవచ్చనిటీజ్ చేస్తోంది.

Big Bachat Dhamaal నుండి ఉచిత డెలివరీ మరియు సులభమైన రిటర్న్స్ గురించి కూడా టీజ్ చేస్తోంది. ఈ సేల్ మొదలవడానికి మరికొన్ని రోజుల సమయం ఉంది కాబట్టి మరిన్ని అఫర్ల గురించి రానున్న రోజుల్లో ప్రకటించవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo