Flipkart Big Saving Days సేల్ మరొకసారి భారీ డీల్స్ తో తిరిగొచ్చింది
ఫ్లిప్‌కార్ట్ తన Flipkart Big Saving Days ను మళ్ళి ప్రకటించింది
ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ సేల్ నుండి భారీ ఆఫర్లు
80% వరకూ భారీ డిస్కౌంట్
ఫ్లిప్‌కార్ట్ తన Flipkart Big Saving Days ను మళ్ళి ప్రకటించింది. ఆగష్టు 15 ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ సేల్ నుండి మరొకసారి భారీ ఆఫర్లు మరియు డీల్స్ తో తీసుకువస్తునట్లు ప్రకటించింది. ఈ సేల్ నుండి ఎలక్ట్రానిక్స్ మరియు యాక్ససరీస్ పైన 80% వరకూ భారీ డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, ఈ సేల్ నుండి అనేక ప్రోడక్ట్స్ పైన బెస్ట్ డీల్స్ కూడా ఇవ్వనున్నట్లు టీజ్ చేస్తోంది.
Surveyఈ ఫ్లిప్‌కార్ట్ సేల్ ఏ తేదీ నుండి స్టార్ట్ అవుతుంది అనే విషయాన్ని మాత్రం ప్రకటించలేదు. ఆగష్టు 5వ తేదీ నుండి 9వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ కోసం ICICI మరియు Axis బ్యాంక్ భాగస్వామిగా కలిశాయి. ఫలితంగా ఈ రెండు బ్యాంక్ కార్డ్స్ తో వస్తువులను కొనుగోలుచేసే కస్టమర్లకు 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. 'జబర్దస్త్ ఆఫర్స్ ఫర్ ఎవ్రీ ఇండియన్' క్యాప్షన్ తో వస్తున్న ఈ సేల్ నుండి మంచి డిస్కౌంట్ మరియు డీల్స్ అందించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ టీజింగ్ మొదలుపెట్టింది.
ఇక కొనుగోలు దారులు ఎక్కువగా లాభాలను అందుకునే ఆఫర్ల గురించి చూస్తే, స్మార్ట్ ఫోన్స్, LED టీవీలు మరియు అప్లయన్సెస్ పైన మంచి డిస్కౌంట్ అఫర్ చేయబోతున్నట్లు ఫ్లిప్‌కార్ట్ చెబుతోంది. ముఖ్యంగా, ఎలక్ట్రానిక్స్ మరియు యాక్సెసరీస్ పైన గరిష్టంగా 80% వరకూ డిస్కౌంట్ అఫర్ చేనునట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేకమైన మైక్రోసైట్ పేజ్ ద్వారా ప్రకటించింది.
ఇది మాత్రమే కాదు, ఫ్యాషన్ మరియు బ్యూటీ విభాగాల్లో కూడా మరిన్ని లాభాలను కస్టమర్లు ఆస్వాదించవచ్చని టీజ్ చేస్తోంది. బ్రాండెడ్ షూస్, టీషర్ట్స్ మరియు లేడీస్ బ్యూటీ ప్రోడక్ట్స్ పైన అధిక 50-80% డిస్కౌంట్ అఫర్ చేయనుంది. ఈ సేల్ నుండి రిఫ్రిజిరేటర్లు కేవలం రూ. 6,490 రూపాయల నుండి ప్రాంభమవుతాయి. ఈ సేల్ నుండి సౌండ్ బార్స్ మరియు టీవీల పైన మరిన్ని డీల్స్ అందుకోవచ్చు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile