ఫేస్ బుక్ లో వస్తున్న మేమరిస్ ఫీచర్ కు ఫిల్టర్ ఆప్షన్

ఫేస్ బుక్ లో వస్తున్న మేమరిస్ ఫీచర్ కు ఫిల్టర్ ఆప్షన్
HIGHLIGHTS

మీకు నచ్చని మేమరిస్ ను గుర్తు చేయదు.

On this Day అనే పేరుతో ఒక కొత్త ఫీచర్ ను రిలీజ్ చేసింది ఫేస్ బుక్ ఈ మధ్య కాలంలో. ఇది మనం గతంలో సేమ్ డే లో ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన విషయాలను మనకు చూపిస్తుంది.

వాటిని అవసరం అయితే అందరికీ మళ్ళీ షేర్ చేసుకోవచ్చు కూడా ఫేస్ బుక్ లోనే. ఇది చాలా మందికి తెలుసు. కానీ మీకు ఇబ్బంది కరమైన మెమరీస్ ను ఫేస్ బుక్ నోటిఫై చేయకుండా కొత్తగా ఫిల్టర్ ఆప్షన్ కూడా తెచ్చింది.

దీని ద్వారా ఫ్రెండ్స్ మరియు డేట్స్ ఆధారంగా కొన్ని మేమరిస్ ను గుర్తుకు చేయకుండా సెట్ చేసుకోవచ్చు. ఫేస్ బుక్ అకౌంట్ లో  Apps సెక్షన్ లోకి వెళ్తే.. On this Day కనిపిస్తుంది. 

దాని పై క్లిక్ చేసి యాప్ ఇంటర్ఫేస్ కు వెళ్లి preferences పై క్లిక్ చేస్తే అక్కడ ఫ్రెండ్స్ అండ్ డేట్స్ ను చూస్ చేసుకోగలరు. ఇక మీకు ఇష్టంలేని మేమరిస్ రిమైండ్ చేయదు ఫేస్ బుక్.

దీనితో పాటు ఫేస్ బుక్ Reactions అనే ఫీచర్ పై వర్క్ చేస్తుంది. ఇది స్టాండర్డ్ అండ్ బోరింగ్ LIKE కు అదనంగా ఎక్స్ ప్రేషన్స్ తో కూడిన emojis ను యాడ్ చేస్తుంది. సో మీరు లైక్ తో పాటు ఎమోషన్ కూడా చూపించ వచ్చు.

Ajit Singh
Digit.in
Logo
Digit.in
Logo